టీఆర్ఎస్ లో చేరికపై ఎల్ రమణ క్లారిటీ

Update: 2021-06-07 13:31 GMT
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నారని.. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక చర్చ జరిపారని వార్తలు వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు ఎల్.రమణ స్పందించారు.

జూన్ 1న తనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేశారని చెప్పారని ఎల్ రమణ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిసి రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచన చేస్తున్నారని అడిగారని కూడా ఆయన తెలిపారు.

గతంలో కూడా టీఆర్ఎస్ నుంచి తనకు పార్టీలో చేరాలని ఆఫర్లు వచ్చాయని..ఇది కొత్త కాదని కొట్టిపారేశారు. పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చేయలేదని.. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకుంటానని ఎల్.రమణ పేర్కొన్నారు.ఎల్.రమణకు టీఆర్ఎస్ లో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ వచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News