ఆ విమ‌ర్శ‌కే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోవాలా ర‌మ‌ణ‌?

Update: 2015-08-06 10:05 GMT
రాజ‌కీయ పార్టీలు అన్న త‌ర్వాత విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు మామూలే. కాక‌పోతే.. తెలివైన టీఆర్ ఎస్ పార్టీ అదును చూసుకొని ఎక్క‌డ ఎలా మాట్లాడితే ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఎంత‌గా డ్యామేజ్ జ‌రుగుతుందో బాగా తెలుసు. అయితే.. టీఆర్ ఎస్ వ్యూహాన్ని బ‌లంగా తిప్పి కొట్టే అల‌వాటు లేని తెలుగుదేశం పార్టీ.. ఆర్చుకొని.. తీర్చుకొని మాట్లాడేస‌రికి పుణ్య‌కాలం కాస్తా గ‌డిచిపోవ‌టం మామూలే.

బుధ‌వారం లోక్ స‌భ‌లో తెలంగాణ ప్ర‌త్యేక హైకోర్టు విష‌యంపై చ‌ర్చ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌త్యేక హైకోర్టు రాకుండా ఏపీ ముఖ్య‌మంత్రి అడ్డుకుంటున్నార‌ని.. హైకోర్టు రాకుండా చేసి తెలంగాణ మీద పెత్త‌నం చెలాయించాల‌ని భావిస్తున్నారంటూ తీవ్ర ఆరోప‌ణ చేశారు.

ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు వెనువెంట‌నే.. అక్క‌డిక‌క్క‌డే స‌మాధానం చెప్పాల్సిన తెలుగు త‌మ్ముళ్లు రెండు కేక‌లు వేశారే త‌ప్పించి.. ధీటుగా స్పందించింది లేదు.

కానీ.. ఒక రోజు ఆల‌స్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యులు ఎల్ ర‌మ‌ణ రియాక్ట్ అయ్యారు. బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే స‌హించేది లేద‌ని ర‌మ‌ణ హెచ్చ‌రిస్తూ.. బాబుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌విత క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తండ్రి.. బిడ్డ‌లు కాల‌గ‌ర్భంలో క‌లిసే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని కేసీఆర్‌.. క‌విత‌ల్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్య‌లు చేశారు.
 
ఎంత బాబు మీద చిన్న విమ‌ర్శ చేస్తేనే.. మ‌రీ..కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌న్న తీవ్ర వ్యాఖ్య‌లు అవ‌స‌ర‌మా ర‌మ‌ణ అన్న మాట వినిపిస్తోంది.  క‌విత చేసిన విమ‌ర్శ‌కు ధీటైన వాద‌న‌ను తెర‌పైకి తీసుకురావాలే కానీ.. ఉత్తుత్తి అరుపుల‌తో ఉప‌యోగం ఉంటుందా? డాబు మాట‌ల కంటే.. విష‌యం ఉన్న విమ‌ర్శ బ‌ల‌మైంది.. ప‌దునైంద‌న్న విష‌యం ర‌మ‌ణ అండ్ కోకు ఎప్పుడు తెలుస్తుందో..?
Tags:    

Similar News