కేసీఆర్ వద్దకు ఎల్.రమణ.. టీఆర్ఎస్ లో చేరిక?

Update: 2021-07-08 08:30 GMT
ఒక బలమైన బీసీ నేత టీఆర్ఎస్ నుంచి వీడిపోయారు.. దీంతో అంతే బలమైన బీసీ నేతను కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుంచి పంపించిన టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇప్పుడు అదే బీసీల్లో బలమైన నాయకుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి రెడీ అయ్యారు.

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్. రమణను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ  రెడీ అయ్యారు.

తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదంలో పడింది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజే ఆయన కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే సీఎం కేసీఆర్ ను రమణ కలువనున్నారు.

తెలంగాణలో టీడీపీ మరుగునపడిపోయింది. నేతలంతా వివిధ పార్టీల్లో చేరిపోయారు.ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో టీడీపీలో భవిష్యత్ లేదని గ్రహించిన రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కూడా పలు హామీలు ఇవ్వడంతో ఆయన చేరికకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే టీఆర్ఎస్ మంత్రి పదవికి, ఎమ్మెల్యేకు రాజీనామా చేసి వైదొలగించారు. పోయిన బీసీ నేత స్థానంలో అదే బీసీ వర్గానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేత అయిన రమణను కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు.

ఈటలకు ప్రత్యామ్మాయంగా బీసీ నేతను తీసుకోవాలని టీఆర్ఎస్ ఎల్. రమణకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కన్వీనర్ గా, మంత్రిగా పనిచేశారు.

ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణతో పలుమార్లు ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రమణతో చర్చలు జరిపినట్లు సమాచారం.

కాగా ఈ ప్రతిపాదనకు ఎల్. రమణ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చించి ఓ నిర్ణయానికి రావడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ తోపాటు బీజేపీ నేతలు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ వైపే వెళ్లడానికి ఎల్. రమణ డిసైడ్ అయ్యారు.
Tags:    

Similar News