టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌పై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. లోకేష్ బాధ్యతలను చంద్రబాబు ఎవరికైనా అప్పగించాలన్నారు. లోకేష్ పాదయాత్ర చేసి టీడీపీని ఉద్దరిస్తానని చెబుతున్నాడని.. అయితే ఆ పాదయాత్రతో ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు.
టీడీపీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించి తప్పు చేయొద్దని చంద్రబాబుకు సూచించారు. నందమూరి కుటుంబంలోనే ఎవరికో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించాలన్నారు. నందమూరి కుటుంబంలో సరైనవారు ఎవరో ఒకరు ముందుకు రావాలన్నారు.
టీడీపీ, జనసేనకు గత ఎన్నికల్లో పట్టిన గతే వచ్చే ఎన్నికల్లోనూ పడుతుందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. జగన్ అధికారంలోకి మూడేళ్లు దాటినా ప్రజలు ఆయన కోసం పరితపిస్తున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. తాజాగా మదనపల్లె సభకు వచ్చిన జనసందోహమే ఇందుకు నిదర్శనమన్నారు.
పవన్ కల్యాణ్ ఏం చేయోలో తెలియక అయోమయంలో ఊగిసలాడుతున్నారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు జగన్ పాలనలో సంపూర్ణ న్యాయం జరుగుతోందన్నారు. విద్యా వ్యవస్థ కూడా ఏపీలో బాగుందన్నారు.
ఏపీలో పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని లక్ష్మీపార్వతి చెప్పారు. అంబేడ్కర్, మహాత్మాగాంధీ కలలు కన్న పరిపాలనను వైఎస్ జగన్ అందిస్తున్నారని ఆమె కొనియాడారు.
తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకున్నాక లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి వారిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అసవరం లేదన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.