ఉత్తమ్ కి చివరి అవకాశం..ఈసారైనా విజయం సాధించేనా?

Update: 2020-01-17 05:47 GMT
అయన ప్రధాన పీఠం ఎక్కినప్పటి నుండి పార్టీకి అన్ని పరాజయాలే. ఈనెలలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికలే - ఆయన నాయకత్వంలో చివరివి. దీంతో పురపాలికల్లో విజయం సాధించి - కెప్టెన్సీ నుంచి దిగిపోవాలనుకుంటున్నారు ఆ సీనియర్ నేత. మరి గులాబీ పుంజులు కత్తులు దూయడానికి సిద్దంగా వున్న నేపథ్యంలో - ఈ ఆఖరి బరిలోనైనా ఆ నాయకుడు సత్తా చాటుతాడా - స్థానిక సంగ్రామంలో విజయపతాకం ఎగరేసి - గాంధీభవన్‌ సింహాసనం  నుండి గర్వంగా దిగిపోతారా. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి - ఈ మున్సిపల్ ఎన్నికలు దాదాపు చివరి ఎన్నికలు. ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించి ఉత్తమ్ - పురపాలిక ఎలక్షన్స్ తర్వాత దిగిపోతానంటున్నారు. అసెంబ్లీ - పార్లమెంట్‌ పోరులో ఏమత్రం సత్తాచాటలేకపోయిన ఉత్తమ్ - తన సొంత నియోజకవర్గంలో - భార్యను సైతం గెలిపించలేక చతికిలబడ్డారు. దీంతో పీసీసీ పగ్గాల నుంచి ఉత్తమ్ తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు - ఉత్తమ్‌ కు ఆఖరి పరీక్షగా మారాయి.

మున్సిపల్‌ ఎన్నికలకు అటు టీఆర్ ఎస్‌ సమరోత్సాహంతో ఉరకలెత్తుతుంటే - కాంగ్రెస్‌ మాత్రం ఇంకా సిద్దం కాలేదని తెలుస్తోంది. గెలిచినా, ఓడినా ప్రస్తుతానికి ఇవే ఉత్తమ్ నాయకత్వంలో చివరి ఎన్నికలని భావిస్తున్న తరుణంలో, ఏ లీడరు కూడా సీరియస్‌ గా తీసుకున్నట్టు కనపడటంలేదు. తన లీడర్‌ షిప్‌ ఆఖరి ఎలక్షన్స్‌ కావడంతో - ఉత్తమ్ కుమార్‌ రెడ్డే అడపాదడపా జిల్లా నాయకులతో మాట్లాడి - సత్తా చాటాలని కోరుతున్నారు. మొత్తానికి పురపాలికల్లో గెలిచినా - ఓడినా ఉత్తమ్ పీసీసీ సింహాసనం దిగిపోవడం ఖాయం. అయితే, విజయంతో గౌరవప్రదంగా దిగిపోవాలన్నది ఉత్తమ్ ఆలోచన. మరి , విజయం తో పీఠం దిగిపోతారో ..లేక మరోసారి తన పంథాలోనే పరాజయంతో పీఠం నుండి దిగిపోతారో చూడాలి.
Tags:    

Similar News