బీజేడీ క్లీన్ స్వీప్..గెలుపంటే ఇది

Update: 2022-03-14 05:31 GMT
క్లీన్ స్వీప్ అంటే ఇలా ఉండాలి. గెలుపంటే ఇదే అన్నట్లుగా ఉండాలి. ఇపుడు ఒడిస్సాలో బీజూ జనతాదళ్ గెలుపు ఇలాగే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఒడిస్సాలో స్ధానిక సంస్ధల్లో ఒకటైన జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాల్లోని జిల్లా పరిషత్తులను బీజేడీ గెలుచుకున్నది. అంటే బీజేడీ క్లీన్ స్వీప్ చేసేసిందన్న విషయం అర్ధమవుతోంది. 30 జిల్లాల్లో కలిపి 852 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

కడపటి వార్తలు అందే సరికి 766 స్థానాలు బీజేడీ గెలుచుకుంది. బీజేపీ 42 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాలు గెలుచుకుంది. ఇండిపెండెంట్లు కూడా పెద్దగా ఖాతా తెరవలేకపోయిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 90-95 శాతం స్థానాలు గెలుచుకోవటం ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడ ఆశ్చర్యం ఎందుకంటే అధికారపార్టీకి సహజంగానే జనాల్లో వ్యతిరేకత ఉంటుందన్నది సహజం. కానీ ఒడిస్సాలో సీన్ రివర్సులో నడుస్తోంది.

ఎందుకంటే ఒడిస్సాకు గడచిన 22 ఏళ్ళుగా  నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే జనాల్లో వ్యతిరేకత వచ్చేస్తున్న కాలమిది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు వరుస ఎన్నికల్లో నవీన్ గెలుస్తునే ఉన్నారు.

ఇన్ని సంవత్సరాలుగా అధికారంలోనే ఉంటున్నా నవీన్ పై ఎందుకు జనాల్లో వ్యతిరేకత కనబడటం లేదు ? ఎందుకంటే నవీన్ జనరంజక పాలనే కారణం.

ఎవరితోను ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా ఇటు అధికార యంత్రాంగంపై పట్టుసాధించి అటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటున్నారు. అందుకనే జనాలకు నవీన్ కు ప్రత్యామ్నాయం అవసరం లేదనిపిస్తోందేమో.

ఈ కారణంతోనే ఎన్నికలు ఏవైనా కానీండి నవీన్ నాయకత్వంలోని బీజేడీదే అధికారం అన్నట్లుగా అయిపోయింది. ఇందుకు జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలే తాజా నిదర్శనం.
Tags:    

Similar News