తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి రెండు అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో మొదటిది ఆయన తన ఎన్నికల అఫిడవిట్ ను తప్పుగా ఇచ్చి.. ఆ తర్వాత లోగుట్టుగా ఎన్నికల సిబ్బంది సాయంతో మార్చుకున్నారని. దీనిపై ఇప్పటికే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది.
ఇదిలా ఉంటే.. మరో షాకింగ్ ఉదంతం ఏమంటే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కిరాయి మూకకు రూ.15 కోట్లు సుపారీ ఇచ్చి మరీ ప్లాన్ చేశారని.. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకొని పేట్ బషీరాబాద్ పోలీసులు (హైదరాబాద్ మహానగరంలోని కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్) ఢిల్లీకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారని.
అయితే.. అదుపులోకి తీసుకున్న నిందితుల్లోని వారు మాజీ మంత్రి జితేందర్ రెడ్డి ఇంట్లో తలదాచుకున్నట్లుగా చెబుతున్నారు. మహా కన్ఫ్యూజింగ్ గామారిన ఈ ఎపిసోడ్ మీద పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే.. సోషల్ మీడియాతో పాటు.. స్థానిక మీడియా సంస్థల వెర్షన్ మరోలా ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ తన నామినేషన్ పత్రాలతో పాటు.. తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ ను తొలుత ఒకటి ఇచ్చి.. ఆ తర్వాత మరొకటి తయారు చేసి.. ఎన్నికల కమిషన్ సిబ్బందిలోని ఒక ఉద్యోగిని తనకు అనుకూలంగా మార్చుకొని.. తిరిగి అప్ లోడ్ చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వటం.. దానిపై సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసినట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణకు రాబోతున్న వేళ.. ఆ కేసును విత్ డ్రా చేసుకోవాలన్న తీవ్ర ఒత్తిళ్లు మొదలైనట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే న్యాయపోరాటం చేస్తున్న వారితో పాటు.. ఇతరులను కలిపి హత్యాయత్నం నేరం కింద తాజాగా అరెస్టు చేసినట్లుగా షాకింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాల మీద పోరాటం చేస్తున్న రాఘవేంద్రరావు ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు.. తాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నానన్న విషయాన్ని వెల్లడించటంతో పాటు.. ఫైల్ నెంబర్లు.. వాటి సెక్షన్లను చెబుతూ పోలీసులకు వివరించిన వైనంతో వారంతా ఆశ్చర్యానికి గురి అయినట్లుగా తెలుస్తోంది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సేకరించటానికి రాఘవేంద్రరావు ఇప్పటివరకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని.. కేవలం రూ.18 లక్షల మొత్తాన్ని జిరాక్స్.. స్టేషనరీ కోసం ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదొక్కటి చాలు..శ్రీనివాస్ గౌడ్ చేసిన తప్పుల లెక్క చెప్పటానికి అని చెబుతున్నా.. ఇప్పుడు అదే వ్యక్తి మీద మంత్రిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారంటూ.. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మరిన్ని కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ ఆరోపణల్లో నిజానిజాలేమిటన్నది పోలీసులు తీల్చాల్సి ఉంది.