కేసీఆర్ మంత్రివర్గం.. ‘కొత్త’ ప్లాన్..

Update: 2019-02-18 05:13 GMT
ప్రస్తుతం దేశ రాజకీయ చిత్రంలో ఆరితేరిన దురంధరుడిగా పేరొందాడు కేసీఆర్. ఎంతలా అంటే తను ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ స్కీమును కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు కాపీ కొట్టేంతగా.. ప్రజలను ఎలా ఆకర్సించాలో.. ఎలా ఓట్లు సంపాదించాలి? నేతలను ఎలా లొంగదీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ చతురత ఎవ్వరికీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల భావన..

అలాంటి కేసీఆర్ ఏదీ చేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది.. తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందుగా పత్రికలు, మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తుంటారు కేసీఆర్. అది ప్రజల్లో బాగా చర్చకు దారి తీసి పాజిటివ్ లేదా నెగెటివ్ అభిప్రాయాలు వచ్చాక దానిపై సరైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తుంటారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ కేసీఆర్ అదే ఫార్ములాను అప్లై చేయడం విశేషం.

తాజాగా తెలంగాణలో రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎవ్వరికీ చోటు ఉంటుదన్న విషయం తెలంగాణలో ఒక్క కేసీఆర్ కు తప్ప ఎవ్వరికీ తెలియదు. కానీ వ్యూహాత్మకంగా కేసీఆర్ మౌనం దాల్చారు. తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు సీనియర్లకు ఈసారి మంత్రి పదవులు రావని.. జూనియర్లు, కొత్తవారికే తొలిదఫాలో మంత్రిపదవులంటూ ప్రచారం చేయించారు. దీన్ని బట్టి పోయిన సారి ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటలకు మంత్రి పదవి రాదని ఖరాఖండీగా లీకులు ఇప్పించారు. కేటీఆర్, హరీష్ లాంటి సీనియర్లకు కూడా మంత్రి పదవులు లేవని స్పష్టతనిచ్చారు.

కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసమే సీనియర్లను కాకుండా ఈసారి జూనియర్లకు మంత్రి పదవులు ఇప్పిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సీనియర్లయితే తనకు ఎదరుచెబుతారని.. అదే జూనియర్లు అయితే చెప్పిన మాట.. ఆధిపత్యం, కరప్షన్ తగ్గుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ పట్టాభిషేకానికి కూడా జూనియర్లు మంత్రులుగా ఉంటేనే మేలని భావిస్తున్నారు. అందుకే సీనియర్లకు పార్టీ పదవులు.. జూనియర్లకు మంత్రి పదవులు అనే కొత్త కాన్సెప్ట్ తో కేసీఆర్ ముందుకు వెళుతున్నట్టు సమాచారం. ఇదంతా కేటీఆర్ కోసమేనన్న చర్చ కూడా టీఆర్ ఎస్ లో సాగుతోంది.
Tags:    

Similar News