రాజులు పోయారు, రాచరికం అంతరించింది. కేవలం చరిత్ర పాఠాలుగా వాటిని చదువుకుంటున్నారు. కానీ నయా రాచరికాలు కళ్ళ ముందే ఉన్నాయి. కేవలం అయిదేళ్లకు మాత్రమే మీరు మాకు సేవ చేయాలీ అంటూ ఓటు ద్వారా జనాలు అప్పగించిన అధికారాన్ని అందిపుచ్చుకుని ప్రభువులుగా మారి ఆ ప్రజల మీదనే తమ అధికార జులుం చూపించే వారిని జన చైతన్యమే చెక్ పెడుతుంది. దీన్ని విప్లవం అనాలో మరోటి అనాలో చెప్పలేరు కానీ ప్రజలను మండిస్తే జరిగేది ఇదే అని మాత్రం మెల్లగా పాలకులకు అర్ధమవుతోంది.
తెలంగాణాలో కళ్ళెదుట జరిగిన ఒక ఉదంతం ఇపుడు చర్చనీయాశంగా ఉంది. అంతే కాదు ప్రజలు తలచుకుంటే ఏమైనా చేస్తారు అని కూడా రుజువు చేస్తోంది. తెలంగాణాలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పెద్ద ఎత్తున ప్రభుత్వం కట్టించినా అందులో ప్రవేశానికి మాత్రం లబ్దిదారులు నోచుకోలేకపోతున్నారు. దాదాపుగా రెండు లక్షల ఇళ్ళు కళ్ళ ముందు నిర్మాణం పూర్తి అయి ఉన్నాయి.
అంతే కాదు, ఏడాది పైగా కాలం గడచిపోయినా కట్టిన ఇళ్ళలో గృహ ప్రవేశం లేదాయే. ఇక ఈ ఇళ్ళకు అర్హులైన లబ్దిదారుల జాబితాను రెడీ చేయడంతో కూడా పాలకులు ఉదాశీనత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మరో వైపు చూస్తే తమ వారికి అస్మదీయులకు ఈ ఇళ్లను అప్పగించాలన్న దూరాలోచన కూడా ఉందని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఈ నేపధ్యంలోనే చూసి చూసి వేసారి కొందరు లబ్దిదారులు తాళాలు పగులగొట్టేసి మరీ డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఆక్రమించేశారు.
హ్యాపీగా నివాసం ఉంటున్నారు. అలాంటి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించడం అయితే అటు రెవిన్యూకి కానీ, ఇటు పోలీసు వర్గాలకు కానీ అసలు కుదిరడం లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి 2.91 లక్షల ఇళ్లు మంజూరైతే వాటిలో .82 లక్షల ఇళ్లు దాదాపుగా పూర్తయినట్టే. కానీ ఇప్పటి దాకా 17 వేల ఇళ్లను మాత్రమే ప్రజలకు అప్పగించడం జరిగింది. అంటే లబ్దిదారుల ఎంపిక ఎంత తాపీగా జరుగుతోందో అర్ధం చేసుకోవాలి.
మరి తమ కోసం కట్టిన ఇళ్ళు, తమకు కాకుండా చేస్తున్న పాలకుల నిర్లక్ష్య వైఖరికి పేద వాడికీ, గూడు లేని వాడికి ఎక్కడో కాలింది. అంతే వాటిని స్వాధీనం చేసుకుని కాపురాలు పెట్టేశారు. దీంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టింది అని అంటున్నారు. నిజానికి చేయాల్సింది ఏదో దర్జాగా తమ చేతుల మీదగా చేస్తే ఇంత దాకా పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న మాట ఇపుడు వినిపిస్తోంది.
తమ చేతుల మీదుగా తాము చేయలేకపోబట్టే ఇపుడు ప్రజలు తమ చేతుల్లోకి డబుల్ బెడ్ రూం ఇళ్ళను తీసుకుని సర్కార్ పెద్దలకు డబుల్ షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు. నిజానికి ఇది కేవలం తెలంగాణా సమస్య మాత్రమే కాదు, ఏపీలో కూడా టిడ్కో ఇళ్ళు అలా కళ్ళ ముందు కట్టి ఉన్నాయి. వాటిని కూడా ఈ రోజు వరకూ ఇవ్వకుండా ప్రభుత్వం చేయాల్సినది చేస్తోంది. దాని మీద ఉద్యమాలు కూడా లబ్దిదారులు చేశారు, అయితే ఇపుడు డబుల్ బెడ్ రూం ఇళ్ళను తీసుకున్న లబ్దిదారుల చైతన్యం ఏపీలోనూ రగిలితే టిడ్కో ఇళ్ళ ముచ్చట కూడా అలాగే సాగుతుంది. మొత్తానికి చూస్తే పాలకులకు షాక్ ఇచ్చే జన చైతన్యం గానే ఇలాంటివి చూడాలి అని అంటున్నారు.