తొలి 'గే' ప్ర‌ధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి రికార్డ్‌!

Update: 2017-06-15 11:57 GMT
కొన్ని దేశాల్లో స్వ‌లింగ సంప‌ర్కులంటే చిన్న‌చూపు ఉంటుంది. వారు ప‌నిచేసే చోట వివ‌క్ష‌ను ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితులు కూడా ఉంటాయి. కానీ, భారత సంతతికి చెందిన స్వ‌లింగ సంప‌ర్కుడు లియో వరద్కర్ ఇటువంటి వివ‌క్ష‌ల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అంతేకాదు, అత్యంత చిన్న‌ వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా చ‌రిత్ర‌కెక్కారు. ఓ దేశానికి గే ప్రధాని కావడం ఇదే తొలిసారి.  

ఇప్పటికే క్యాబినెట్‌ లోని పలువురు సీనియర్ మంత్రులు - మెజారిటీ ఎంపీలు వరద్కర్ కు బహిరంగంగా మద్దతు పలికారు. ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ఇటీవలే తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో తాను ప్రధాని పదవికి పోటీ చేయనున్నట్టు వరద్కర్ ప్రకటించారు. మెజార్టీ మద్దతు లభించడంతో వరద్కర్ ప్రధానిగా ఎంపిక‌వ‌డం సులువైంది.

డబ్లిన్‌ లో నివసిస్తున్న డాక్టర్ లియో వరద్కర్ (38) ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రిది ముంబై. తల్లిది ఐర్లాండ్. వరద్కర్ 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి సంచలనం సృష్టించారు.

వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్‌ ది ముంబై కాగా, తల్లి మిరియమ్‌ ది ఐర్లాండ్. వరద్కర్ తండ్రి అశోక్ వృత్తిరీత్యా డాక్టర్. తల్లి మిరియమ్ న‌ర్సుగా పని చేశారు. 1970లలో ఇంగ్లాండులో పని చేసే సమయంలో వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండులో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఐర్లాండులోని డబ్లిన్‌కు వచ్చారు. వరద్కర్ అక్కడే జన్మించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News