విశాఖ‌పై 'న్యూట్ర‌ల్‌గా'గా ఆలోచిద్దాం.. ఎవ‌రిది త‌ప్పు.. ఎవ‌రిది ఒప్పు..?

Update: 2022-10-30 02:30 GMT
విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డుతోంది. కాదు.. అమ‌రావ‌తినే రాజ‌ధాని చేయాల‌ని.. ఇక్క‌డే నిర్మించాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ, టీడీపీలు దీనిని రాజ‌కీయంగా మార్చారు. వైసీపీయేమో.. మూడు ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని అంటే.. టీడీపీ అడ్డు ప‌డుతోంద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు ప్ర‌జ‌ల్లోఒకి కూడా తీసుకువెళ్తున్నారు. ఇక‌, టీడీపీ ఏమో.. విశాఖ‌ను దోచుకునేందుకే.. వైసీపీ నాయ‌కులు అక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌ని అంటున్నార‌ని యాంటీ ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, ఈ త‌తంగంలోకి ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మ‌రోరూపంలో రియాక్ట్ అయ్యారు. విశాఖ‌ను దోచుకునేందుకే.. అంటూ.. ఆయ‌న కూడా టీడీపీ పాట‌నే పాడారు. పోనీ.. గ‌తంలో ప‌వ‌నే చేసిన‌ట్టుగా అనంత‌రం రాజ‌ధాని అయితే త‌ప్పేంటి? క‌ర్నూలు రాజ‌ధాని కాకూడ‌దా? అన్న మాట‌ల‌ను ఆయ‌న మ‌రిచిపోయారు.

ఇక‌. బీజేపీ నాయ‌కులు.. త‌మ‌కు అమ‌రావ‌తి కావాల‌ని.. అంటూనే(ఎందుకంటే ఇక్క‌డ వారికి రైతుల‌పై ప్రేమ లేదు. కేవ‌లం ఇక్క‌డ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేసినందునే) క‌ర్నూలులో హైకోర్టు కావాల‌ని చెబుతున్నారు.

దీంతో ఈ విషయాల్లో ఏది క‌రెక్ట్‌? ఏది నిజం? అస‌లు ఏం జ‌రుగుతోంది?  న్యూట్ర‌ల్‌గా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే నేత‌లు కానీ, మేధావులుకానీ క‌నిపించ‌క‌పో వ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌సేపూ.. రాజ‌ధాని రాజ‌కీయం త‌ప్ప‌.. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌డం లేదు. వాస్త‌వానికి చూస్తే.. విశాఖ‌పై టీడీపీ చేస్తున్న ప్ర‌చారం త‌ప్పు. ఒక‌వేళ దోచుకునేందుకే రాజ‌ధాని ఏర్పాటు చేస్తే.. దీనిని ఆధారాల‌తో స‌హా నిరూపించి.. దోపిడీ దారుల‌ను జైలుకు పంపించేందుకు మార్గం ఉంది. అలాగ‌ని.. అస‌లు రాజ‌ధానే వ‌ద్ద‌న‌డం స‌రికాదు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఉన్న అమ‌రావ‌తి స్థానంలో మూడు రాజ‌ధానులు తీసుకురావ‌డం ద్వారా అభివ‌వృద్ధి సాధ్య‌మ‌ని చెబుతోంది. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తామ‌ని అంటున్నారు.

అయితే.. దీనిని ఎలా సాధిస్తారు?  ఏవిదంగా ముందుకు తీసుకువెళ్తారు.  అస‌లు మూడు రాజ‌ధానుల్లో ఏయే ప్రాజెక్టులు పెడ‌తారు?  ఎలా డెవ‌ల‌ప్ మెంట్ చేస్తారు? అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో ఒక విధ‌మైన అయోమ‌యం నెల‌కొని.. ఎవ‌రికీ వారు మ‌ద్ద‌తు ఇవ్వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఇప్ప‌టికైనా.. క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News