బీజేపీ పెద్దాయన మోడీకి జైకొట్టారు

Update: 2019-08-05 11:32 GMT
బీజేపీ పెద్దాయన.. ప్రధాని మోడీకి గురువు ఎల్ కే అద్వానీ తాజాగా నోరు విప్పారు. తనను పక్కన పెట్టేసిన శిష్యుడి నిర్ణయాల్ని చూస్తూ ఉండటం తప్పించి స్పందించటం దాదాపుగా తగ్గించేసిన అద్వానీ.. తాజాగా  కశ్మీర్ అంశంపై మోడీ సర్కారు తీసుకున్ననిర్ణయం నేపథ్యంలో రియాక్ట్ అయ్యారు.

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ను రద్దు చేయటంపై సంతోషమన్నారు. జాతీయ సమగ్రతతో పాటు.. జాతిని బలోపేతం చేసే దిశగా ఇదో మంచి ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 370 రద్దు విషయం బీజేపీ మూల సిద్ధాంతంలో ఒకటన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ పై మోడీ సర్కారు తాజా నిర్ణయం ఉందన్నారు.

కశ్మీర్ లో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేయాలని జనసంఘ్ రోజుల నుంచే ఉందని.. ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తసీుకున్న ప్రధాని మోడీకి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్.. లద్దాఖ్ లోని ప్రజలు శాంతి.. సంతోషంగా జీవించటానికి తాజా చారిత్రక నిర్ణయం అవకాశం ఇస్తుందన్న ఆశావాదాన్ని ఆయన వ్యాఖ్యల్లో వినిపించింది.

    

Tags:    

Similar News