సుష్మా 15ఏళ్లకే సాధించింది!

Update: 2015-07-25 04:54 GMT
సాధారణంగా 15ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? అన్నీ సరిగా జరిగితే తొమ్మిదో తరగతో, పదోతరగతో చదువుతారు! అదీ కాదంటే గాలికి తిరుగుతూ "ఎయిర్ ఫోర్స్"లో జాబ్ అని చెప్పుకుంటుంటారు! కాని ఇక్కడ ఒక అమ్మాయి 15 ఏళ్లకే ఏవేవో చేసేస్తోంది! ఆ వయసులో అసాధ్యం అనుకునే చదువులు సునాయాసంగా చదివేస్తోంది!

వివరాళ్లోకి వెళితే... ఊపీకి చెందిన సుష్మా వర్మ 15ఏళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది! అంతేనా... పీహెచ్ డీ కూడా మొదలెట్టేసింది! ప్రస్తుతం లక్నోలోని బాబసాహెబ్ భీం రావ్ అంబెద్కర్ యూనివర్శిటీలో పర్యావరణ మైక్రోబయాలజీలో ఆమె పరిశోధన చేయనుంది! ఇప్పటికే ఎంఎసీ మైక్రోబయాలజీలో యూనివర్సిటీ టాపర్ గా నిలవడంతో... ప్రత్యేక విభాగంలో ఆమెకు తప్పనిసరిగా పీహెచ్ డీ అడ్మిషన్ ఇస్తామని వీసీ చెబుతున్నారు! ఇంతకూ ఈమె సకల సౌకర్యాలు, ఒత్తిడిలేని జీవితం, ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుండి రాలేదు... ఈమె ఒక సామన్య కుటుంబం నుండి వచ్చింది! ఈమె తండ్రి ఒక సామాన్య పారిశుధ్య కార్మికుడి కూతురు! వయసుకు తగ్గ చదువులు చదవడానికి కూడా శ్రద్ధ చూపించని ఎంతోమందికి సుష్మా ఆదర్శం అనే చెప్పాలి!!
Tags:    

Similar News