మాచ‌ర్ల ఘ‌ట‌న‌: పోలీసులు మనోళ్ల‌పైనే కేసులు పెట్టారు.. ఎమ్మెల్యే చెప్పింది ఇదేన‌ట‌!

Update: 2022-12-20 04:52 GMT
ఉమ్మ‌డి గుంటూరు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో రెండు రోజుల కిందట టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలానే ఫైర‌య్యారు. డీజీపీపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేప‌ట్టిన ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్య‌క్ర‌మాన్ని మాచ‌ర్ల‌లోనూ నిర్వ‌హించేందుకు త‌మ్ముళ్లు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌ను రాకుండా.. వ‌చ్చిన వారిని అక్క‌డ కాలు మోప‌కుండా.. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌రిమితరిమి కొట్టారు. ఇక‌, ఈ స‌మ‌యంలోనే టీడీపీ వాహ‌నాల ద‌హ‌నం.. ఇళ్లు ధ్వ‌సం.. వ్య‌క్తుల విధ్వంసం.. వంటివి చోటు చేసుకున్నాయి. క‌ట్‌చేస్తే.. ఇది మూడు రోజుల పాటు ప్ర‌ధాన మీడియాలో ప్ర‌సారం అయింది. అన్ని వైపుల నుంచి వేళ్లు వైసీపీవైపు చూపించాయి.

దీంతో అధిష్టానం ఉలిక్కిప‌డింది. దీనిపై వివ‌ర‌ణ కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని కీల‌క స‌ల‌హాదారు.. ఆదేశించారు. అయితే.. అధిష్టానంపై కోపంతో ఉన్న పిన్నెల్లి..త‌న కీల‌క అనుచ‌రుడిని.. పంపించి..వివ‌ర‌ణ ఇచ్చార‌ని తెలిసింది. దీనిలో ఆయ‌న పేర్కొన్న విష‌యం ఏంటంటే..

"వైసీపీకి మాచ‌ర్ల కంచుకోట‌గా ఉంది. టీడీపీ నేత‌లుఇక్క‌డ ఇదేం ఖ‌ర్మ చేసేందుకు వ‌చ్చారు. అయితే,వారు మ‌నం క‌ట్టుకున్న హోర్డింగులు, ఫ్లెక్సీలు(గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మానికి సంబంధించి), ఎమ్మెల్యే బ్యాన‌ర్ల‌ను చింపేసిన‌ట్టు తెలిసింది. దీంతో మ‌న వాళ్ల‌ను చూసి ర‌మ్మ‌ని.. వాటిని స‌రిచేసి ర‌మ్మ‌ని.. పంపించాను. కానీ, టీడీపీ నేత‌లు రెచ్చ‌గొట్ట‌డంతో వారే ఇదంతా చేసుకుని మ‌న వాళ్ల‌పై నెట్టే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు కూడా టీడీపీ వారికే అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి.. వైసీపీ వాళ్ల‌పై కేసులు పెట్టించారు. ఇందులో మ‌నోళ్ల త‌ప్పు ఏమీ లేక‌పోయినా.. కేసులు ఎదుర్కొంటున్నారు"అని!!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News