దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాల అంచనాలను కూడా తలదంతూ.. ఇక్కడ ప్రజలు ఓ సంక్లిష్టమైన తీర్పును వెలువరించారు. నిజానికి చెప్పాలంటే.. అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అన్నట్టుగా ఉంది పరిస్థితి. అధికార పక్షం బీజేపీ-జేడీయూ ఎన్డీయే కూటమి, ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ-కాంగ్రెస్‌ల మహాకూటమిలకు ఆశించిన విధంగా ప్రజలు మొగ్గు చూపలేదనే చెప్పాలి. అంటే.. మేజిక్ ఫిగర్ విషయంలో ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలను బట్టి చూస్తే.. అదేసమయంలో మహాకూటమిగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు కూడా అదే స్థాయిలో ప్రజలు మద్దతు పలికారు.
మరీ ముఖ్యంగా ఆర్జేడీ యువ కిశోరం.. తేజస్వికి ప్రజలు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. మహా కూటమి టెక్నికల్‌గా ఓడిపోయినప్పటికీ.. చెప్పులరిగేలా తిరుగి ప్రచారం చేసిన తేజస్వి కష్టం బాగానే ఫలించింది. ఈ రెండు పరిణామాలే.. బిహార్ భవితవ్యాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టాయని అంటున్నారు పరిశీలకు లు. బిహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టే పార్టీకి 122 స్థానాలు ఉండాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీ-జేడీయూ కూటమికి ఈ ఫిగర్ వచ్చింది. అయితే, అదేసమయంలో ఆర్జేడీ-కాంగ్రెస్‌ల మహాకూటమికి కూడా 115 వరకు స్థానాలు వచ్చాయి.
అంటే.. అధికారం చేపట్టబోయే.. కూటమికి మేజిక్ ఫిగర్ వచ్చినప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మహా కూటమి కూడా అత్యంత బలంగా ఉంది. కేవలం ఓ పది మంది నేతలు జంప్ చేస్తే.. తేజస్వి సీఎం పీఠం అందుకోవడం పెద్ద సమస్యకాదు. దీంతో ఎన్డీయే అధికారం చేపట్టినా.. ఎన్నాళ్లు మనగలుగుతుందనేది ప్రధాన సమస్య. పోనీ.. ఎన్డీయే కూటమి నుంచి తేజస్వి కూటమిలోకి జంప్ చేసిన వారైనా.. తేజస్విని కుదురుగా ఉడనిస్తారా? అనేది మరో ప్రధాన సమస్య. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఆసరా చేసుకుని.. ఆడించే అవకాశం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉంటుంది.
దీంతో బిహార్‌లో ఎన్డీయేని దెబ్బతీయాలని తేజస్విని చూసినా.. తేజస్విని దెబ్బకొట్టాలని ఎన్డీయే ప్రయత్నించినా.. మొత్తానికి రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కల్లే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో మళ్లీ మధ్యప్రదేశ్‌లో జరిగినట్టు.. అంటే వేరే పార్టీలో గెలిచి.. బీజేపీలోకి జంప్ చేసి.. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఇలాంటి పర్యవసానం ఏదైనా ఎదురు కావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి బిహారీల తీర్పు ఇలా ఉండడం.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అంటున్నారు పరిశీలకులు.