చింతకింది మల్లేశం... ఈ పేరు వినగానే చేనేత కార్మికులు ఇట్టే గుర్తుపట్టేస్తారు! ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ పేరు వినిపిస్తోంది. మల్లేశానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది..! ఇతడి స్వస్థలం యాదాద్రి జిల్లాలోని శారాజీ పేట. ఆలేరు నియోజక వర్గంలో ఉంది. మల్లేశం పెద్దగా చదువుకోలేదు. పాఠశాల స్థాయిలోనే చదువుకు దూరమయ్యాడు. ఆ తరువాత చేనేత కార్మికుడిగా మారాడు. ఎంతోమంది తోటి చేనేత కార్మికుల కష్టాలను తీర్చినందుకు మల్లేశానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది.
నేత కార్మికుల జీవితాల గురించి మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ. ఒక చీర నేయడానికి చాలా సమయం శ్రమించాల్సి ఉంటుంది. ఒక చీరకు ఆసు పొయ్యాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ ఎన్నిసార్లు తిప్పాలో తెలుసా... 9000 సార్లు! ఆ లెక్కన రోజుకి 18 వేల సార్లు కండె చుట్టూ దారాన్ని తిప్పగలిగితే రెండు చీరలను మాత్రమే ఒక కార్మికుడు నెయ్యగలుగుతాడు. ఈ లెక్కన నేత కార్మికుడికి సరైన ఆదాయం రావడం లేదు. మొదట్లో మల్లేశం పరిస్థితి కూడా ఇంతే. దారాన్ని చుడుతూ చుడూతూ అలసిపోయేవాడు. మల్లేశం తల్లి కూడా ఇదే పనిలో ఉండేది. ఆమె కూడా చేతులు నొప్పులు పెడుతున్నా దారం చుడుతూనే ఉండేది. ఆమె కష్టాన్ని చూసి మల్లేశం ఆవేదనకు గురౌతూ ఉండేవాడు. తన తల్లి మాదిరిగానే ఎంతోమంది పడుతున్న కష్టానికి ఏదో ఒక పరిష్కారం చూపించాలని ఆలోచించసాగాడు. ఆ ఆలోచనల సమాహారమే... లక్ష్మీ ఆసు యంత్రం!
మల్లేశం కనిపెట్టిన ఆసు యంత్రం పేరు అది. తన తల్లిపేరును ఈ యంత్రానికి పెట్టాడు. తాను తయారు చేసి యంత్రానికి చిన్న కెపాసిటర్ అమర్చి - మోటారుకు అనుసంధానం చేశాడు. దాంతో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా సులువుగా ఆసుపోసుకునే అవకాశం ఉంటుంది. ఈ యంత్రం సాయంతో రోజుకు 7 చీరలు నేసే అవకాశం ఉంటుంది. ఈ యంత్రంతో మల్లేశం చేనేత కార్మికులకు సుపరిచితమయ్యాడు. నేతన్నల కష్టాలను తీర్చిన ఈ యంత్రానికి 2011లోనే పేటెంట్ సంపాదించాడు. అదే ఏడాదిలో ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా మల్లేశం గురించి ప్రత్యేకంగా కథనం రాసింది. నేత కార్మికుల కోసం మల్లేశం కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం అతడికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నేత కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన మన మల్లేశానికి హ్యాట్సాఫ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/