మీరు విన్నది నిజమే. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ (బెజవాడ).. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల రూపురేఖలు మొత్తంగా మారిపోనున్నాయి.తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 25 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో భారీగా మార్పులు చేర్పులు చేయనున్నారు.
ప్రస్తుతం ఉన్న సౌకర్యాలకు.. సదుపాయాలకు అదనంగా కార్పొరేట్ లుక్ ను ఈ రెండు స్టేషన్లకు తీసుకురానున్నారు. రానున్న మరో రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తున్న ఈ హంగులుకానీ పూర్తి అయితే.. షాపింగ్.. ఎంటర్ టైన్ మెంట్ కు నెలవులుగా ఈ రైల్వే స్టేషన్లు మారిపోనున్నాయి. సూపర్ మార్కెట్లో.. ఫుడ్ కోర్టులు.. మల్టీఫ్లెక్సులు అందుబాటులోకి రానున్నాయి.
రైల్వే ప్రయాణం మరింత సౌకర్యంగా చేయటంతో పాటు.. రైళ్ల కోసం వెయిట్ చేసే వారి సమయం ఏ మాత్రం వేస్ట్ కాకుండా ఉండేలా తాజా ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంఅనుకుంటున్న పనుల్ని పూర్తి చేసేందుకు అవసరమైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసే ప్రక్రియను ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న హంగుల విషయానికి వస్తే.. అదనంగా విశ్రాంతి గదులు.. మరుగుదొడ్లు.. స్మార్ట్ సైబర్ కేఫ్ లు.. బడ్జెట్ హోటళ్లు.. బేకరీలు.. షాపింగ్ మాల్స్.. మల్టీఫ్లెక్సులు నిర్మిస్తారు. వింటుంటేనే ఆసక్తికరంగా ఉన్న ఈ పనులు మొదలై.. పూర్తి అయితే.. ఈ రెండు స్టేషన్ల లుక్ మొత్తం మారిపోతుందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/