తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. రైతుల విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క యాత్ర నిర్వహించారు. అన్నదాత ఆక్రందన యాత్ర పేరుతో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఖమ్మం వరకు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన గమనార్హం. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మాటల గారడితో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయి రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నదాతల అవస్థలు అర్థం కావటం లేదని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పత్తి - మిర్చి నకిలీ విత్తనాల కారణంగా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారన్నారు. నకిలీల బారిన పడి నష్ట పోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని భట్టి డిమాండ్ చేశారు. సకాలంలో విత్తనాలు - ఎరువులు బ్యాంకు రుణాలు అందించటంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రద్ధ వహించలేదన్నారు. ఆక్రందన యాత్ర పేరుతో వందలాది మంది రైతులు ట్రాక్టర్లతో పాల్గొనటం ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే హైదరాబాద్ వరకు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వరకు వెళతామని భట్టి అన్నారు. నాగార్జునసాగర్ లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయత లేకుండా జిల్లాల విభజన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నుంచి అనేక సంక్షేమ పథకాలు మాటలకే పరిమితమవుతున్నాయని, ప్రజలను మాయ చేసేందుకు ఏదో ఒక సంఘటనను తీసుకొనివచ్చి పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పాలనను, నాయకుల తీరును గమనిస్తున్నారని, దీనికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. యాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క స్వయంగా ట్రాక్టర్ ను నడిపి కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హామీలకు ఆచరణకు ఏమాత్రం పొంతన లేకపోవటంతో రైతులతో సహా ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటంలో ముందుకు రాక పోవటం శోచనీయం అన్నారు. ఈ కారణంగా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని చింతిస్తున్నారని ఆరోపించారు. నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ మిర్చినారు వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు నష్టపోయారన్నారు. బాధిత రైతాంగానికి ఎకరానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని తాము పోరాడుతుంటే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విత్తన కంపెనీల తొత్తులుగా వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు. నష్టపోయిన రైతులకు వారు చెల్లించిన విత్తన - నారు ధరలకు రెట్టింపు ఇచ్చి చేతులు దులుపుకునే కుట్ర పన్నుతున్నారన్నారు. రైతులు ఇంత భారీగా నష్టపోయినా స్పందించి రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తమ పోరాటానికి కించ పరిచే విధంగా వ్యాఖ్యానిస్తుండటం బాధాకరమన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/