అది అమెరికా.. అక్కడ ఒకరితో ఒకరికి సంబంధాలుండవు.. ఇంట్లో ఒక్కరే సంవత్సరాల పాటు ఉంటారు. భవబంధాలకు దూరంగా జీవిస్తారు... అలాగే ఓ ఒంటరి మహిళా కూడా జీవించింది. కొడుకు ఉద్యోగ వేటలో ఎక్కడో పనిచేస్తుండడంతో ఒక్కతే 20ఏళ్ల నుంచి ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసేవాడు. అన్నింటిని చూసే వాడు కానీ ఆ ఫ్రిజ్ ను మాత్రం తల్లి తెరిచి చూపించేది కాదట..ఆ ఫ్రిడ్జ్ లో ఏముందనే ఆసక్తి ఆ కొడుకులో 20 ఏళ్లుగా పెరిగిపోయింది.
అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న ఆడమ్ స్మిత్ తాజాగా ఉపిరితిత్తుల క్యాన్సర్ తో బాదపడుతూ చనిపోయింది. దీంతో ఆమె కొడుకు స్మిత్ సెయింట్ లూయిస్ వచ్చి తల్లి కర్మఖాండలు చేయించాడు.
ఆ తర్వాత ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు, డబ్బు, ఆభరణాల కోసం వెతికాడు. ఈ క్రమంలోనే తల్లి ఎప్పుడూ చూపించని ఫ్రిడ్జ్ ను తెరిచి చూశాడు. షాక్ అయ్యాడు. ఆ ఫ్రిడ్జ్ లో ఓ బాక్స్ లో ఓ పసిగుడ్డు శిశువు మృతదేహం ఉంది. 20 ఏళ్లుగా అది అలానే ఉందట.. ఇన్నేళ్లు గడిచినా శిశువు చర్మం, జట్టు అన్ని అవయవాలు చెక్కు చెదరకుండా ఉన్నాయట..
వెంటనే స్మిత్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆ శిశువు ఎవరనేదానిపై ఆరాతీశారు. తల్లి దాచిన ఆ శిశువు ఎవరో తెలియక కొడుకు స్మిత్ తెలిసిన వారిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారట..