అమెరికా విద్యాలయంలో మరో హింసాకృత్యం జరిగింది. కెంటకీలోని ట్రాన్సిల్వేనియా వర్సిటీలో మాజీ విద్యార్థి ఒకరు పెద్ద కత్తి - బ్లేడ్లతో విద్యార్థులపై దాడికి పాల్పడిన మూడురోజుల వ్యవధిలోనే మరో ఘటన జరిగింది. హ్యూస్టన్ లోని యూనివర్సిటీలో వేట కత్తితో జరిగిన ఉన్మాదం ఫలితంగా ఒకరు మృత్యువాత పడగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హ్యూస్టన్ లోని ఆస్టిన్ క్యాంపస్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఈ దారుణం సంభవించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా అనుమానించి 27 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల్లో ఒకరు తీవ్రగాయాలతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (యూటీ) పోలీసు చీఫ్ డేవిడ్ కార్టర్ చెప్పారు. ఈ ఘటనతో కొంతకాలంపాటు తరగతులు రద్దు చేశారు.
యూనివర్సిటీలోని గ్రెగరీ జిమ్ వెలుపల ఓ వ్యక్తి కత్తితో ఒకరిపై దాడిచేసినట్లు పోలీసు కార్యాలయానికి ఫోన్ వచ్చింది. దీంతో హుటాహుటిన క్యాంపస్ కు వెళ్లిన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. పొడవైన వేట కత్తితో ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడని పోలీసు చీఫ్ కార్టర్ తెలిపారు. అతడిని కెండ్రెక్స్ జే వైట్ గా గుర్తించినట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/