రాష్ట్రంలో 50వేల పెళ్లిల్లు వాయిదా!

Update: 2016-12-04 08:14 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం సామాన్యుల‌పై తీవ్రంగా ప‌డుతోంది. దైనందిన అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు బ్యాంకులు - ఏటీఎంల వ‌ద్ద‌ క్యూ లైన్లతో అవ‌స్థ‌లు ప‌డుతూ ఉన్న‌వారు ఒక‌వైపు అయితే....ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల విష‌యంలో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు మ‌రోవైపు. తాజాగా వివాహ అవ‌స‌రాల‌కు త‌గిన సొమ్ములు లేక‌పోవ‌డం వ‌ల్ల తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50వేల పెళ్లిల్లు ర‌ద్దు అయిన‌ట్లు వార్తలు వెలువ‌డుతున్నాయి. పెళ్లి ఖ‌ర్చు కింద రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌లు బ్యాంక‌ర్లు ఇస్తార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ బ్యాంక‌ర్లు చుక్క‌లు చూపిస్తుండ‌టంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని వాపోతున్నారు.

వివాహ ఖ‌ర్చుల విష‌యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటును ఉప‌యోగించుకునేందుకు బ్యాంకులు వెళ్లిన కుటుంబాల‌కు తీవ్ర నిరాశ ఎదుర‌వుతోంది. వివాహ ప‌త్రిక‌ - పాన్ కార్డు - ఆధార్ కార్డ్ వంటి ష‌రామామూలు ప‌త్రాలు అడ‌గ‌టంతోనే స‌రిపెట్ట‌కుండా లావాదేవీల వివ‌రాల‌ను ఇవ్వాల్సిందేన‌ని బ్యాంక‌ర్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఆన్ లైన్ చెల్లింపులు చేస్తే స‌దరు వివ‌రాల‌ని కోరుతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు చేసుకోలేని వారు ఇచ్చిన అఫిడ‌విట్లు వంటివి కూడా బ్యాంకు అధికారులు అడుగుతున్నారని ప‌లువురు వాపోతున్నారు. వీట‌న్నింటి కోసం తిర‌గ‌లేక వివాహం వాయిదా వేసుకోవ‌డం మేలు అని ఇరు కుటుంబాలు నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని మీడియా వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

త‌న ఇల్లు అమ్మగా వ‌చ్చిన సొమ్ముతో కూతురు వివాహం చేసేందుకు బ్యాంకులో సొమ్ములు డిపాజిట్ చేసిన ఓ మ‌హిళ ఇపుడు విత్ డ్రా చేసుకునేందుకు వీలు కాక‌పోవ‌డంతో ఆదివారం జ‌ర‌గాల్సిన వివాహాన్ని వాయిదా వేసేసుకున్నారు. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లే ఎన్నో ఉన్నాయి. కాగా ఈ ప‌రిణామంపై బ్యాంక‌ర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం తాము న‌డుచుకుంటున్నామ‌ని, అత్యున్న‌త బ్యాంకు ఆదేశాల‌కు మించి తాము ఏమీ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా ప్ర‌స్తుత ముహుర్తాలు దాటిపోతే జ‌న‌వ‌రి 15 త‌ర్వాతే మ‌ళ్లీ ఉంటాయ‌ని జ్యోతిష్యులు అంటున్నారు. అప్ప‌టివ‌ర‌కు ప‌రిమిత మొత్తం విత్ డ్రా తంటాలు తీరిపోతాయి కాబ‌ట్టి వివాహాలు ఊపందుకుంటాయ‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News