మావోయిస్టు అగ్రనేత ఆర్కే అదృశ్యం ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏఓబీలో ఎన్ కౌంటర్ తర్వాత తన భర్త కనిపించకపోవడంపై ఆర్కే సతీమణి శిరీష్ హైకోర్టును ఆశ్రయించారు. ఏవోబీ ఎన్ కౌంటర్ తరువాత నుంచీ తన భర్త ఆర్కే ఆచూకీ తెలియడం లేదని - ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని పేర్కొన్న శిరీష్ ఆయనను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న విషయం కావడంతో అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. అమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. ఆర్కే తమ వద్ద లేడని పోలీసులు ఇప్పటికే ప్రకటించగా.... పోలీసులు ఆయన ప్రాణాలకు ముప్పు తలపెట్టి ఉంటారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్కే సతీమణి అభ్యర్థనను కోర్టు స్వీకరించి ఆయన్ను తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశిస్తే... ఈ ఉత్కంఠకు తెరపడినట్లేనని పలువురు అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/