ఏటీఎం కార్డుతో అనేక సౌలభ్యాలున్నప్పటికీ సమస్యలు కూడా వినియోగదార్లను ఇబ్బంది పెడుతుంటాయి. ఏటీఎం పిన్ నంబర్ ను మర్చిపోవటం, కార్డు పోయిన సందర్భాల్లో దొరికినవాళ్లు దుర్వినియోగం చేయటం, కార్డును క్లోనింగ్ చేసి నకిలీ కార్డును సృష్టించటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు తెర దించేలా అమెరికాకు చెందిన మాస్టర్ కార్డ్ కంపెనీ కొత్తరకం బయోమెట్రిక్ కార్డును తీసుకొచ్చింది.
ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీతో బయోమెట్రిక్ కార్డును ఈ కంపెనీ తయారుచేసింది. వినియోగదారుడికి కార్డును అందజేయటానికి ముందే సదరు వ్యక్తి వేలిముద్రను తీసుకొని, కార్డు మీద ఆ సమాచారాన్ని డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ కార్డుతో వినియోగదారుడు షాపింగ్ చేసినప్పుడు.. వేలిముద్రను కార్డు రీడింగ్ యంత్రంలో నమోదు చేస్తే సరిపోతుంది. పిన్ నంబర్ ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా బయోమెట్రిక్ కార్డును ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. ఈ బయోమెట్రిక్కార్డును సొంతదారుకాకుండా ఇతరులు దుర్వినియోగపరిచే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు. బయోమెట్రిక్ కార్డు వినియోగంపై దక్షిణాఫ్రికాలో రెండుప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని, ఈ ఏడాది చివరకు ఈ కార్డును విస్తృతంగా వినియోగంలోకి తీసుకొస్తామని మాస్టర్ కార్డు ఎంటర్ ప్రైజ్ రిస్క్ - సెక్యూరిటీ విభాగం ప్రెసిడెంట్ అజయ్ భంగా తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/