ఒకవైపు వారణాసిలోని ప్రార్ధనా మందిరం జ్ఞానవాపి వివాదం కొలిక్కిరాకుండానే గుజరాత్ లోని మధుర ప్రార్థనా స్థలం పై వివాదం పెరిగిపోయింది. మధురలో జన్మించిన పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడి మందిరాన్ని కూలగొట్టి అక్కడ మసీదు నిర్మించారనే వివాదం చాలా సంవత్సరాలుగా నలుగుతోంది. ఇదే విషయమై అప్పుడెప్పుడో దాఖలుచేసిన పిటీషన్ను విచారించేందుకు మధుర కోర్టు ఇపుడు అంగీకరించింది. దాంతో మరో ప్రార్థనా స్థలం వివాదం రాజుకోనుంది.
మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్ధలంలో ఒక మందిరాన్ని వందల సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు ధ్వంసంచేసి మసీదును నిర్మించారంటు లక్నోకు చెందిన రంజన అగ్నిహోత్రి తో పాటు మరో ఆరుగురు శ్రీకృష్ణ విరాజమాన్ కు సన్నిహితులైన వారు కేసు దాఖలుచేశారు.
శ్రీకృష్ణ జన్మస్ధానంలో నిర్మించిన మందిరాన్ని ధ్వంసంచేసి ముస్లిం పాలకులు మసీదును నిర్మించిన కారణంగా దాన్ని తొలగించి మళ్ళీ మందిర ప్రాంతాన్ని తమకు అప్పగించాలని విరాజమాన్ సన్నిహితులు పిటీషన్లు కోరారు.
అయితే ఆ పిటీషన్ను అప్పట్లో కోర్టు కొట్టేసింది. దాంతో రివ్యూ పిటీషన్ వేయటమే కాకుండా తమ వాదనకు ఆధారాలుగా పిటిషనర్లు చూపారు. దాంతో తాజాగా ఆ పిటీషన్ కు విచారణ అర్హత ఉందని అభిప్రాయపడిన కోర్టు విచారణ మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతొ ఇప్పటికే జ్ఞానవాపి వివాదంతో మొదలైన ఉద్రిక్తతలకు తోడు మధుర వివాదం కూడా తోడవ్వబోతోంది.
మధురలో నిర్మించిన మసీదు గోడలపైన కూడా దేవతామూర్తుల ప్రతిరూపాలు ఇప్పటికీ కనబడతాయని పిటిషనర్లు చెప్పారు. మసీదు కింద దేవాలయం ఆనవాళ్ళు ఉన్నాయనేందుకు తగిన ఆధారాలను కోర్టుకు అందించారు.
కేసు విచారణ సందర్భంగా దేవాలయ ఆనవాళ్ళను, హిందూ దేవతామూర్తులు చిత్రాలను చెరిపేయకుండా వెంటనే మసీదులోని అన్ని ప్రాంతాల్లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ఇదే సమయంలో తాజా వివాదంలో శాస్త్రీయమైన ఆధారాలను చూపేందుకు పురాతత్వ శాఖ నిపుణులను పంపాలని కూడా పిటీషనర్లు కోరారు. వీటిన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు తొందరలోనే తగిన ఆదేశాలను ఇస్తామని చెప్పింది.