ఓటుకు నోటు కేసు.. దానికి బదులుగా ఫోన్ ట్యపింగ్ ఇష్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం ఎంత ఉద్రిక్తతలకు కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారాల కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్యనున్న ఘర్షణ వాతావరణం కాస్తా కారు మేఘాల మాదిరిగా తొలగిపోయి.. స్నేహ హస్తంతో ఇరువురు నేతలు పలుకరించుకోవటం.. కులాసాగా కబుర్లు చెప్పుకోవటం తెలిసిందే.
ఇద్దరు చంద్రుళ్ల మధ్య ఇంతటి అనుబంధానికి కారణం ఏమిటన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సరైన కారణం చెప్పే నేతలు ఎవరూ ఉండటం లేదు. సరైన విశ్లేషణ చేసే నేతలు కనిపించని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరి మధ్య అనుబంధానికి కారణంపై ఓటుకు నోటు కేసులో నిందితుడు కమ్ సాక్షి అయిన జెరూసలెం మత్తయ్య తన ప్రెస్ నోట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య అనుబంధానికి కారణం చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రైస్తవుల ప్రార్థనల కారణంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిరిందని.. ఈ అద్భుతం ఏసుక్రీస్తు దైవశక్తి.. క్రైస్తవుల ప్రార్థనలతోనే సాధ్యమైందని ప్రజలు గుర్తించాలంటూ మత్తయ్య పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజకీయ విభేదాలు సమిసిపోవటానికి దైవశక్తి కారణం అంటూ క్లెయిం చేసుకోవటం మత్తయ్యకే చెల్లుతుందేమో.