మోడీ ద‌మ్మును ప్ర‌శ్నించిన మాయావ‌తి

Update: 2016-11-24 11:24 GMT
మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం విప‌క్షాల చేతికి ఆయుధంగా మారుతోంది. నోట్ల ర‌ద్దుపై పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ అంశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్న అక్క‌డి పార్టీలు మోడీపై ఎదురుదాడి చేస్తున్నాయి. తాజాగా బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి మోడీకి భారీ స‌వాల్ విసిరారు. 90 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు మద్దతిస్తున్నారని చెప్పుకోడవం సిగ్గుచేటని అన్న ఆమె... సర్వే తప్పుడు సర్వే అని, ఫలితాలను డబ్బులిచ్చి రాయించుకున్నారని ఆరోపించారు. మోడీకి దమ్ముంటే లోక్ సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు తమ ఫలితాలను వెల్లడిస్తారని, దాన్నే సర్వే ఫలితంగా తీసుకోవచ్చని అన్నారు.

నోట్ల రద్దును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మాయావతి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు పెద్దనోట్లు రద్దుతో ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో అధికారంఓ ఉన్న సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన‌ ఎంపీ అక్షయ్‌ యాదవ్‌ కాగితాలు చింపి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పై విసిరేశారు.

కాగా స్పీకర్‌ పై కాగితాలు విసిరిన ఎంపీపై కేంద్ర స‌ర్కారు ఆగ్ర‌హించింది. అక్ష‌య్‌ యాద‌వ్‌ పై చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. లోక్‌స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం ఇదే అంశంపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు - అనంత్‌ కుమార్ లు భేటీ అయ్యారు. మొత్తానికి మోడీ నిర్ణ‌యం దేశ రాజ‌కీయాల్లో భారీ కుదుపే తెచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News