కాకినాడ పురపాలక ఎన్నికల్లో ఏపీ అధికారపక్షం తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం తెలిసిందే. అయితే.. ఈ విజయం వెనుక మీద అధికారపక్షం లెక్కల ఒకలా ఉంటే.. విపక్షాల లెక్కలు మరోలా ఉన్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటంతో.. కాకినాడ మేయర్ పీఠాన్ని ఎవరు కైవశం చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధించిన వారంతా సంబరాలు చేసుకుంటూనే.. కీలకమైన మేయర్ స్థానాన్ని సొంతం చేసుకోవటానికి వీలుగా ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మేయర్ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేస్తామని గతంలోనే టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మేయర్ కుర్చీలో ఎవరు కూర్చుంటారన్న అంశంపై కొంతమేర క్లారిటీ ఉందని చెప్పాలి. గెలుపొందిన తెలుగు తమ్ముళ్లలో కాపు సామాజిక వర్గానికే అధికార పీఠం దక్కనుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మేయర్ బరిలో నలుగురి మధ్యన ఉందన్న వాదన వినిపిస్తోంది. శేషకుమారి.. అడ్డూరి లక్ష్మి.. సుంకర పావని.. సుంకర శివప్రసన్నలు ఉన్నట్లుగా చెబుతున్నారు. తుది నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకోనున్నారు. మొత్తం 50 స్థానాలకు 48 స్థానాల్లోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. న్యాయపరమైన చిక్కుల మధ్య రెండు వార్డుల్లో ఎన్నికను నిలిపివేశారు. 48 స్థానాలకు టీడీపీ కూటమికి 35 స్థానాలు (టీడీపీ 32.. బీజేపీ 3) సొంతం చేసుకోగా.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల్లో పది మంది విజయం సాధించారు. తాజా విజయంతో.. కాకినాడ కార్పొరేషన్ 30 ఏళ్ల తర్వాత టీడీపీ సొంతమైందని చెప్పాలి.