విమర్శలు.. ఆరోపణలకు ఉండే పదును కొన్నిసార్లు ఇట్టే కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి కథనాన్ని ఒకటి అచ్చేసిన పత్రిక కథనం ఒకటి ఇప్పుడు సంచలంగా మారింది. ఏపీ సర్కారు తీరును తప్పు పట్టేలా.. నిశిత పరిశీలనతో చేసిన ఆరోపణలు.. విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధికారపక్షానికి అనుకూలంగా.. విపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏపీ పోలీసు తీరును వేలెత్తి చూపించటమే కాదు.. తాము చేస్తున్న విమర్శలకు తగ్గ ఉదాహరణల్ని ఎత్తి చూపించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇంతకీ ఆ కథనంలో ఏముందంటే?
ఏపీ సర్కారు పక్షపాతాన్ని కళ్లకు కట్టినట్లుగా పత్రిక కథనంలో పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో విపక్ష నేతల తీరును తప్పు పడుతూ కేసులు పెట్టిస్తున్న ఏపీ సర్కారు.. అందుకు భిన్నంగా ఏపీ అధికారపక్ష నేతలపై మాత్రం జీవోలు జారీ చేసి మరీ కేసులు ఎత్తేస్తున్నారు. గడిచిన మూడేళ్ల వ్యవధిలో దాదాపు 132 జీవోలు జారీ చేసి మరీ కేసులు ఎత్తేసిన వైనంపై కథనాన్ని అచ్చేశారు.
అధికారపక్షానికి అనుకూలంగా..?
ఏపీ పోలీసుల పక్షపాతాన్ని కళ్లకు కట్టేలా ఉన్న ఈ కథనంలో ఏపీ పోలీసుల తీరును తప్పు పడుతూ.. పత్రిక అచ్చేసిన కథనంలో అధికారపక్షానికి అనుకూలంగా ఉన్న ఉదంతాలతో పాటు.. విపక్షంలో ఉన్నప్పుడు కేసులున్న నేతలు కాస్తా.. అధికారపక్షంలోకి చేరిన వెంటనే వారిపై కేసుల్ని తొలగిస్తున్న వైనాన్ని ప్రస్తావించారు. అందుకు సాక్ష్యంగా కొన్ని ఉదంతాల్ని ప్రస్తావించారు.
= ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై నరసారావుపేట పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. వాటిని ఎత్తేస్తూ జీవోలు జారీ చేశారు.
= ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న రెండు కేసుల్ని జీవోలతో ఎత్తేవారు.
= మంత్రులు దేవినేని ఉమపై ఐదు కేసులు.. మరో మంత్రి కొల్లు రవీంద్రపై ఉన్న మూడు కేసులు ఎత్తేస్తూ జీవోలు జారీ చేశారు.
= వీరితో పాటు మరికొందరు మంత్రులు అచ్చెన్నాయుడు.. నక్కా ఆనందబాబులపై ఉన్న కేసుల్ని ఎత్తేస్తూ జీవోలు జారీ చేశారు.
= వీరే కాదు.. అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు.. అధికారపక్షానికి వెళ్లిన ఎమ్మెల్యేలపైనా కేసులు ఎత్తేస్తూ జీవోలు జారీ చేయటం గమనార్హం.
= మూలపాడు పంచాయితీ ఎన్నికల్లో ఆందోళనకు దిగటమే కాదు.. రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయేలా వ్యవహరించి.. ఉద్రిక్తతకు కారణమైన మంత్రి దేవినేని ఉమపై 2013లో ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే కాక.. వేర్వేరు విషయాల్లోనూ ఆయనపై కేసులు సమోదు కాగా.. వాటిని ఎత్తేస్తూ 2015 జూన్ 2న జీవో నెంబరు 647ను జారీ చేయటం గమనార్హం.
= వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యయేగా ఉన్న గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితోపాటు మరో 20 మందిపై 2014 జూన్ 30న గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసును ఉపసంహరించుకుంటూ జీవో 379ని జారీ చేయటం విశేషం.
విపక్ష నేతలపై మాత్రం ఇలా..
అధికారపక్ష నేతలపై ఉన్న కేసుల్ని ఎత్తేస్తూ జీవోలు జారీ చేస్తున్న ఏపీ సర్కారు.. విపక్ష నేతలపై మాత్రం పలు సందర్భాల్లో కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. ఇందుకు ఉదాహరణాల్ని చూస్తే..
= ప్రత్యేకహోదా సాధన కోసం జరిగే కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం తెలపడానికి వెళుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే పైనే అడ్డగించడం
= మహిళా పార్లమెంటు కు హాజరుకానీయకుండా ఎమ్మెల్యే రోజాను ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోకి తీసుకుని దారులు మార్చి హైదరాబాద్ కు తరలించడం
= ప్రయాణీకుల తరఫున మాట్లాడి వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నించిన ఎంపీ మిథున్ రెడ్డి విమానాశ్రయ మేనేజర్ పై దాడి చేసినట్లు అక్రమ కేసు
= కృష్ణాజిల్లా బస్సు ప్రమాద మృతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్షనేత జగన్.. అక్కడ అవకతవకలపై నిలదీస్తే కలెక్టర్ కు అడ్డుతగిలారంటూ బూటకపు కేసులు పెట్టడం
= బాలసుబ్రహ్మణ్యం వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులపై నడిరోడ్డుపైనే దాడి చేసి బెదిరించినా కనీసం కేసులు పెట్టని పరిస్థితి
= వనజాక్షి నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకు అధికారులపై ఎలాంటి దాడులకు దిగుతున్నా.. కేసులు నమోదు కాని వైనం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/