త‌మ్ముడికి చిరు అండ‌!

Update: 2018-07-06 05:48 GMT
రాజ‌కీయాల్లో చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు సంబంధం ఉండ‌దంటారు. దీనికి త‌గ్గ‌ట్లే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు ఉంటున్నాయ‌ని చెప్పాలి. జ‌న‌సేన పార్టీలో తాను ఒక్క‌డిగానే ప్ర‌యాణిస్తున్న‌ట్లు.. త‌న వెనుక మెగా ఫ్యామిలీ లేన‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. అయితే.. అలాంటిదేమీ లేద‌ని.. ప‌వ‌న్ ఒంట‌రి ఎంత‌మాత్రం కాద‌ని.. ఆయ‌న వెనుక మెగాస్టార్ చిరంజీవి అండ‌తో పాటు.. మెగా ఫ్యామిలీ ద‌న్ను భారీగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే గ‌డిచిన కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఉండ‌నే ఉన్నాయి. ఇటీవ‌ల చిరు త‌న‌యుడు.. ప‌వ‌న్ అబ్బాయ్.. రాం చ‌ర‌ణ్ తేజ త‌న మ‌ద్ద‌తును సోష‌ల్ మీడియా ద్వారా ఓపెన్ గా ప్ర‌క‌టించారు. బాబాయ్ పిలిస్తే.. అబ్బాయ్ రెఢీ అన్న విష‌యాన్ని చెప్పేశారు.  ఆ మ‌ధ్య‌న ప‌వ‌న్ పై చిర్రుబుర్రులాడిన నాగ‌బాబు సైతం ఇప్పుడు ప‌వ‌న్ కు ర‌క్ష‌ణ‌గా ఉంటున్నారు.

ప‌వ‌న్ ను అదే ప‌నిగా టార్గెట్ చేసిన కత్తి మ‌హేశ్ మీద విమ‌ర్శించే అవ‌కాశం చిక్క‌గా.. సినిమా ఇండ‌స్ట్రీలో నాగ‌బాబు మిన‌హాయించి మ‌రెవ‌రూ అంత‌లా రియాక్ట్ కాలేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవి అభిమాన సంఘానికి అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స్వామినాయుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

త్వ‌ర‌లో ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  తాను ఒక్క‌డే కాకుండా వేలాది మంది కూడా చేర‌నున్న‌ట్లు చెప్పారు. స్వామినాయుడితో పాటు జ‌న‌సేన‌లో చేరే వారంతా ఎవ‌ర‌న్న‌ది ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. తాజా ప‌రిణామాల్నిచూస్తే.. ప‌వ‌న్ ఇప్పుడు ఎంత మాత్రం ఒంట‌రి కాద‌ని.. ఆయ‌న‌కు అన్న చిరుతోపాటు.. మెగా కుటుంబంతో పాటు.. మెగా ఫ్యాన్స్ అంతా అండ‌గా ఉండ‌నున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News