అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. అతడి భార్య మెలానియాకు అస్సలు పొసగడం లేదా? ట్రంప్ సహచర్యాన్ని మెలానియా ఎంత మాత్రం ఇష్టపడటం లేదా? ట్రంప్ తో కలిసి పర్యటనలు చేయడంపై ఆమెకు ఆసక్తి లేదా..? మెలానియా తీరు చూస్తుంటే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. శ్వేత సౌధంలో అగ్ర రాజ్యపు ప్రథమ మహిళగా దక్కే గౌరవాల్ని అందుకోకుండా.. కొడుకు చదువు పేరు చెప్పి మరో చోట ఉంటున్నపుడే మెలానియాకు ట్రంప్ కు ఏదో తేడా కొట్టిందని అందరూ సందేహించారు. ఇప్పుడా సందేహాలకు మరింత బలం చేకూర్చేలా ఆమె ప్రవర్తించడం చర్చనీయాంశం అవుతోంది.
అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కాక ట్రంప్ తొలి విదేశీ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా భార్య చేతిని పట్టుకుని నడిచే ప్రయత్నం చేసి భంగపడ్డాడు ట్రంప్. ఏదో ఒకసారి ఇలా జరిగిందంటే యాదృచ్ఛికం అనుకోవచ్చు. ఒకటికి రెండుసార్లు ట్రంప్ చేయిని విడిపించుకునే ప్రయత్నం మెలానియా చేయడం విశేషం. ఆయన భార్య మెలానియాతో కలిసి ముందుగా ఇజ్రాయెల్ లో పర్యటించారు. అక్కడ భార్య చేతిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఆమె తన చేతిని వెనక్కి తీసుకోవడం కెమెరా కళ్లకు చిక్కింది. ఆ తర్వాత రోమ్ పర్యటనలోనూ ట్రంప్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎయిర్ ఫోర్స్ విమానంలోంచి దిగుతున్న వేళ.. ట్రంప్ పక్కనున్న భార్య చేతిని అందుకునే ప్రయత్నం చేయగా.. ఆమె తన చేతిని పైకి తీసుకుని జుట్టును సవరించుకున్నట్లుగా కనిపించింది. దీంతో అవాక్కయిన ట్రంప్.. ఆమె నడుం కింద చేతులు ఆన్చి.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు ఇలా జరగడంతో మెలానియాకు ట్రంప్ అంటే ఇష్టం లేదని.. అతడితో పర్యటనలకు మొక్కుబడిగా వెళ్తోందని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/