మనదేశ జాతీయ గేయమైన వందేమాతరంపై మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన నేపథ్యం పలు వర్గాల్లో ఉన్న భిన్నమైన భావాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో అయితే సాక్షాత్తు ఇద్దరు ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ఎంపిక అయి సాక్షాత్తు భారత రాజ్యాంగంపై ప్రమాణంపై చేసి చేసిన ఎమ్మెల్యేలు `తుపాకీ ఎక్కుపెట్టినా వందేమాతరం పాడేది లేదని ఒకరు, దేశం నుంచి గెంటేసినా సరే ఆలపించేది లేదు` అని మరో ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఈ ఎమ్మెల్యేల తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశయంగా మారింది.
ప్రభుత్వ - ప్రయివేటు స్కూళ్లు - కాలేజీలన్నింటి లో వారానికి రెండుసార్లు వందేమాతరం తప్పనిసరిగా పాడాలని మద్రాస్ హైకోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అంతేకాక - ప్రభుత్వ - ప్రయివేటు కార్యాలయాల్లోనూ నెలలో కనీసం ఒకసారి ఈ గేయాన్ని ఆలపించాలని ఆదేశించింది. కాగా.. మహారాష్ట్రలోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతరం గేయాన్ని పాడడం తప్పనిసరి చేసేలా చర్యలు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ కోరారు. వందేమాతరంను పాడటాన్ని తప్పనిసరి చేసే విషయమై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలుస్తానని, అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతానని పురోహిత్ అన్నారు. మరోవైపు.. బైకుల్లా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే పఠాన్ మాట్లాడుతూ...నిర్ధిష్టమైన భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదని చెప్పారు. తమ మతాచారాల ప్రకారం వందేమాతరం గేయాన్ని పాడకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా తలపై తుపాకీ గురిపెట్టి బలవంతం చేసినా గేయాన్ని మాత్రం ఆలపించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ ఆజ్మీ మాట్లాడుతూ.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందని ఆరోపించారు. ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నానని, వందేమాతరం పాడడం తమ మతాచారాలకు వ్యతిరేకమని అన్నారు. అంతేకాక నిజమైన ముస్లిం వ్యక్తులెవరూ వందేమాతరం గేయాన్ని ఆలపించరని చెప్పారు. దేశం నుంచి వెళ్లగొట్టినా సరే.. ఆ గేయాన్ని పాడనని ఆజ్మీ స్పష్టం చేశారు. మరోవైపు శివసేన నేత - రాష్ట్ర రవాణా శాఖమంత్రి దివాకర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని పాడేందుకు నిరాకరించేవారు దేశ ద్రోహులని అన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా కొందరు మేధావులు పాడిన గేయం వందేమాతరం అని వారు తెలుసుకోవాలని ఆయన సూచించారు.