ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దీంతో, నాని వ్యాఖ్యలకు వైసీపీ మంత్రలు కౌంటర్ ఇస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రి బొత్స అన్నారు. ఇక, తాజాగా నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
తమకు ఏ నానీ తెలియదని.. తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరనేని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు, పార్కింగ్ ఫీజు, స్నాక్స్ అమ్మకాల విషయంలో జరిగే దోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. టికెట్ల రేట్ల మీద అంత బాధ ఉన్నహీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
టికెట్ రేట్లు తగ్గించినందుకు జనం సంతోషంగా ఉన్నారని, హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని అన్నారు. టికెట్ రేటు తగ్గితే రెమ్యునరేషన్ తగ్గుతుందని వారి బాధ అని, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకు పెట్టిన ఖర్చెంత.. పవన్ రెమ్యునరేషన్ ఎంత అని అనిల్ ప్రశ్నించారు. ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్.. తక్కువ రేట్‌కు వినోదం పంచొచ్చు కదా అని ప్రశ్నించారు.
గతంలో తాను కూడా బైక్ అమ్మి పవన్ కు కటౌట్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకున్నానని, ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతేనని అన్నారు. తనకున్న క్రేజ్ ను పవన్ క్యాష్ చేసుకుంటున్నారని, ప్రొడక్షన్ కాస్ట్ 30 శాతం అయితే హీరోల రెమ్యునరేషన్ 70శాతం ఉందని అనిల్ దుయ్యబట్టారు. సినిమాకయ్యే ఖర్చులో 80శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని, దానికోసం కోట్లాది మందిపై భారంపడుతోందని అన్నారు.