యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించి.. రికార్డు సమయంలో పూర్తి చేసినట్లుగా చెబుతున్న ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు ఏ మాత్రం బాగోలేవా? పని చేసుకునేందుకు సౌకర్యవంతంగా లేవా? తమకు కేటాయించిన ఛాంబర్లపై ఏపీ మంత్రులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. గుంటూరు జిల్లా వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు సరిగా లేవన్న మాట పలువురు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న వేళ.. మంత్రుల నోటి నుంచి ఇదే తరహా మాటలు రావటం గమనార్హం.
ప్రతి భవనంలో ఐదేసి చొప్పున మంత్రుల ఛాంబర్లను ఏర్పాటు చేసినప్పటికీ.. ఛాంబర్లు చిన్నవిగా ఉన్నాయని.. ఐదుగురు కూర్చునేందుకు కూడా వీలు లేదని.. చాలా ఇరుగ్గా ఛాంబర్లు ఉన్నట్లుగా మంత్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంత ఇరుగ్గా ఉన్న ఛాంబర్లలో పని చేయటం కష్టమని తేల్చిన వారు.. తమకు కేటాయించిన ఛాంబర్లలో పని చేయటం సాధ్యం కాదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగానే.. సచివాలయంలో ప్రవేశించాల్సిన పలువురు మంత్రులు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవటం గమనార్హం. తాజాగామంత్రి యనమల రామకృష్ణుడు మినహా మరే మంత్రి తనకు కేటాయించిన చాంబర్ ను తీసుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మిగిలిన మంత్రులతో పోలిస్తే.. ఆయన ఛాంబర్ మాత్రమే కాస్తంత విశాలంగా ఉన్నట్లుగా పలువురు అభిప్రాయపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన ఛాంబర్లను కూలగొట్టి.. విశాలమైన ఛాంబర్లను సిద్ధం చేయించాలని మంత్రులు కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
తమకు కేటాయించిన ఛాంబర్లు విశాలంగా లేని నేపథ్యంలో.. వాటిని తీసుకోవటం కుదరదన్న మాటను తేల్చేసిన మంత్రులు.. ప్రస్తుతం ఐదేసి చొప్పున ఉన్న ఛాంబర్లను కూలగొట్టి.. వాటి స్థానంలో మూడు చొప్పున నిర్మించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం రెండు.. మూడు నెలల సమయంలో వీటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్పులు మొత్తం పూర్తి చేసి.. కొత్త ఛాంబర్లను మళ్లీ ఏర్పాటు చేసిన తర్వాతే సచివాలయంలో అడుగు పెట్టాలని పలువురు మంత్రులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరీ ఆలోచనలన్నీ భవనాలు కట్టేటప్పుడు ఏమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఇలా కట్టుడు.. కూల్చుడుతోనే కాలం గడిచిపోతుందా ఏంది?