భారత రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్)కి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే సెంటిమెంటునురెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రం తీసుకున్న కేసీఆర్ కు ఏపీతో పనేంటని ఆమె ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ ఏపీలో అడుగు పెడుతున్న వైనంపై మాట్లాడుతూ.. ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు.
ఏపీలో బీఆర్ ఎస్‌కు ఏం పని? అని రోజా ప్రశ్నించారు. బీఆర్ ఎస్‌లో చేరే ఏపీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి.. రాజధానిని అడ్డగోలుగా దోచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కేసీఆరేనని.. ఇప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకుని ఏపీలో అడుగు పెడతారని రోజా విమర్శించారు. కొత్త రాష్ట్రాన్ని కోరుకున్న వారు(తెలంగాణ) తమకు కొత్త రాజధానిని నిర్మించుకోవాలని, కానీ,అప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను తీసుకున్నారని దుయ్యబట్టారు.
``సెంటిమెంటుతో రాష్ట్రం తీసుకున్నారు. ఏదైనా ఉంటే అక్కడే రాజకీయం చేసుకోవాలి. ఏపీతో ఏపీలో ఏం పని? ఇక్కడ నుంచి బీఆర్ ఎస్‌లో చేరే నాయకులకు ఏపీ ప్రజలే బుద్ధి చెబుతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే.. టీడీపీ ఎమ్మెల్యేలే అయి ఉంటుంది.
వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ ఎస్‌లో చేరరు. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కలిసి పనిచేస్తున్నారు సీఎం జగన్‌ను మరోసారిముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం`` అని రోజా వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.