వైసీపీలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వారంతా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. సగం పాలన కాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని జగన్ మొదట్లో హామీ ఇచ్చారు. నాడు పనితీరు ఆధారంగా మంత్రులను తప్పిస్తామని చెప్పలేదు. హాఫ్ టెర్మ్ అయితే సీటు దిగాల్సిందే అన్నదే కండిషన్ గా పెట్టుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే జగనే చెప్పినట్లుగా తొంబై శాతం మంది మంత్రులకు ఉద్వాసన తప్పదు. ఇది స్థూలంగా వైసీపీలో రాజకీయ వర్గాలలో ఉన్న అభిప్రాయం.
అయితే ఈ మధ్యలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా రెండేళ్ల పాటు రెండు దశలుగా కరోనా వచ్చి మొత్తం సీన్ సితార్ చేసి పారేసింది. ఇక ఏపీలో టోటల్ గా ఆర్ధిక రంగం కునారిల్లింది. అనుకున్నట్లుగా అయితే సాఫిగా ఎక్కడా పాలన సాగడంలేదు. ఈ నేపధ్యంలో మంత్రులను ముందే చెప్పినట్లుగా తొంబై శాతం తప్పిస్తే ఆ రాజకీయ సెగను తట్టుకోవడం కష్టమే. అలాగని విస్తరణ చేపట్టకుండా వదిలేసినా ఎమ్మెల్యేలు, ఆశావహులలో అసంతృప్తి పెద్ద ఎత్తున చెలరేగడం ఖాయం.
దాంతో అన్ని రకాలుగా ఆలోచిస్తున్న వైసీపీ అధినాయకత్వం వయా మీడియాగా సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాని ప్రకారం చూసుకుంటే తొంబై శాతం మంత్రులు కాకుండా పనితీరు మెరుగుపడని వారు, శాఖల మీద పూర్తి పట్టు సాధించని వారు కేటగిరీగా చేసుకుని వారికే ఉద్వాసన పలుకుతారు అన్న చర్చ ముందుకు వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే జగన్ మెచ్చిన వారే క్యాబినెట్లో పూర్తి కాలం మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. లేని వారు ఇంటికే అంటున్నారు. మరి జగన్ ని ఇంప్రెస్ చేయడమే కాకుండా రాజకీయంగా జిల్లాల్లొ బలాఢ్యులుగా ఉంటూ ప్రత్యర్ధి పార్టీలను ముప్ప తిప్పలు పెట్టే వారిని తొలగించడం జరగదు అంటున్నారు. ఆ లిస్ట్ కనుక బయటకు వస్తే ఎవరు మాజీ మంత్రులు అవుతారో చెప్పడం సులువు అంటున్నారు.
ఇక ఇప్పటికి సగం పాలన గడచించి. ఎన్నికల ఏడాదిని వదిలేస్తే మిగిలింది అచ్చంగా ఏడాదిన్నర మాత్రమే. కొత్తగా మంత్రులను తీసుకుని వారికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే వారు అన్నీ రకాలుగా కుదురుకుని మార్కులు వేయించుకోవడానికి ఈ షార్ట్ పీరియడ్ సరిపోదు అంటున్నారు. దాంతో సీనియర్లు, పనిమంత్రులు, శాఖ మీద పట్టు సాధించిన వారిని, కీలక శాఖలను చూస్తున్న వారిని అలాగే కొనసాగించి మిగిలిన వారినే తప్పిస్తారని ప్రచారం సాగుతోంది.
అంటే ఒక అంచనా మేరకు చూసుకుంటే సీనియర్ మంత్రులతో పాటు తొలిసారి మంత్రులు అయినా శాఖల పట్ల బాగా అవగాహన ఉన్న వారిని తప్పించే చాన్సే లేదు. కొన్ని అప్రధాన శాఖలతో పాటు, మంత్రులుగా రాణించలేని వారిని ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారితోనే భర్తీ చేసుకుంటే అటు ఇచ్చిన మాటా నిలబడుతుంది, ఇటు ప్రభుత్వ పాలన కూడా సాఫీగా సాగుతుంది అన్న లెక్కలేవో వైసీపీ అధినాయకత్వానికి ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కొత్త ఏడాది కొత్త ముఖాలతో క్యాబినెట్ రెడీ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్న వేళ జగన్ మెచ్చే మంత్రులు ఎవరూ అన్నదే ఇపుడు తేలాల్సిన అంశమని అంటున్నారు.