బాల‌య్య‌.. మ‌రోసారి చెంప చెళ్లుమ‌నిపించారు

Update: 2017-10-03 09:07 GMT
న‌టుడు.. ఏపీ ముఖ్య‌మంత్రి బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడు.. అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి చేయి లేచింది. త‌మ‌ను అభిమానించి.. ఆరాధించే వారి అత్యుత్సాహాన్ని ఒపిక‌తో.. స‌హ‌నంతో భ‌రించ‌టం సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖులకు అల‌వాటు. కానీ.. దానికి భిన్నంగా బాల‌య్య బాబు.

అభిమానం ఎంత ఉండాలో అంతే ఉండాలే త‌ప్పించి.. ద‌గ్గ‌ర‌కు రావ‌టం.. త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని ప్ర‌య‌త్నించ‌టం లాంటివి బాల‌య్య‌కు అస్స‌లు ఇష్టం ఉండ‌దు. ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న చేతి బ‌లాన్ని అభిమానులకు రుచి చూపించిన బాల‌య్య తాజాగా మ‌ళ్లీ అదే ప‌ని చేశారు.

త‌న‌ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి..అభిమానించే వారిని త‌న క‌ర‌స్ప‌ర్శ‌తో త‌రించిపోయేలా చేయ‌టం బాల‌య్య‌కు అల‌వాటు. తాజాగా అలాంటి అల‌వాటునే మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. తాజాగా అనంత‌పురం జిల్లా హిందూపురం బోయ‌పేట‌లో ఇంటింటా తెలుగుదేశం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై బాల‌య్యను జ‌నం అడుగ‌డుగునా నిల‌దీశారు.

అయితే అభిమానించాలి.. అంత‌కు మించి ఆరాధించాలే కానీ.. ఇలా ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం ఏమిట‌న్న చిరాకులో ఉన్న బాల‌య్య‌కు.. ఒక అభిమాని ద‌గ్గ‌ర‌కు రాబోయాడు. అంతే త‌న చేతి బ‌లాన్ని అభిమాని చెంప‌కు అర్థ‌మ‌య్యేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌తో స‌ద‌రు అభిమాని బిత్త‌ర‌పోయాడు. చుట్టు ఉన్న వారి ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. గ‌తంలో ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించి ప‌లువురు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ బాల‌య్య మాత్రం త‌న తీరును మార్చుకోవ‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Full View
Tags:    

Similar News