అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ వర్సెస్ జేసీ బ్రదర్స్ వర్గం మధ్య మరోసారి రాజకీయ దాడి జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డిపై తొలుత వైసీపీ వర్గానికి చెందిన యువత రాళ్ల దాడికి దిగింది. తాడిపత్రిలోని మూడోవార్డులో పర్యటిస్తుండగా.. అకస్మాత్తుగా అస్మిత్‌పై రాళ్ల దాడి జరిగింది. వీధిలైట్లు ఆపి మరీ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ఇద్దరికి గాయాలు కాగా, అస్మిత్‌రెడ్డికి ప్రమాదం తప్పింది.
ఏం జరిగింది?
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న జేసీ అస్మిత్ రెడ్డి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వార్డుల్లో కొంతకాలంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 3వ వార్డులోని చిన్నబజారు, చింతచెట్టు వీధి తదితర ప్రాంతాల్లో అస్మిత్ రెడ్డి పర్యటించారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ అస్మిత్ తన పర్యటనను కొనసాగించారు. తమ కుటుంబ సన్నిహితుడు జిలాన్‌కు చెందిన 'వహాబ్ బీడీ ఫ్యాక్టరీ' వద్దకు వెళ్లి జిలాన్ యోగక్షేమాలను తెలుసుకున్నారు.
అయితే, అప్పటికే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే వర్గీయులు హాజీ, రఫీ తదితరులు బీడీ ఫ్యాక్టరీలోకి చొరబడి జేసీ అస్మిత్‌డ్డితో వాగ్వాదానికి దిగారు. "మా వార్డులోకి ఎందుకు వచ్చారు" అని నిలదీశారు. ఈ క్రమంలో వారిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ వర్గీయులు మరింత మంది అక్కడకు చేరుకుని సమీపంలోని ఇళ్ల పైకి ఎక్కి రాళ్లు, సిమెంట్ ఇటుకలతో దాడిచేశారు. దాడి నుంచి తప్పించుకొనేందుకు టీడీపీ వర్గీయులు ఎదురుదాడికి దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన ఎమ్మెల్యే వర్గీయుడు హాజీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇరు పక్షాల దాడిలో వహాబ్ బీడీ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, అస్మిత్ తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీడీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. దాడిని నిరసిస్తూ ఇరువురూ తమ అనుచరులతో ర్యాలీ చేపట్టారు. తాడిపత్రి పర్యటనలో ఉన్న టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి జేసీ నివాసానికి చేరుకొని అక్కిత్ రెడ్డిని పరామర్శించారు.
తాడిపత్రిలో టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ భౌతిక దాడులకు తెగబడుతోందని టీడీపీ పోలిటీబ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. తాడిపత్రి టీడీపీ ఇన్చార్జి జేసీ అస్మిత్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు. పోలీసుల ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని, ముఖ్యంగా డీఎస్సీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేని వీరికిపందలు ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారని విమర్శించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.