సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రముఖులకు.. సామాన్యులకు మధ్య దూరం తరిగిపోయింది. ఏదైనా విషయం మీద రియాక్ట్ అయ్యేందుకు సామాన్యులు కూడా పెద్దగా ఫీల్ కావటం లేదు. అదే సమయంలో.. ఆసక్తికరమైన మెసేజ్‌లకు స్పందిస్తున్నారుకొందరు ప్రముఖులు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలుగు నేతల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒకరని చెప్పాలి. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌కి ఆసక్తికర ట్వీట్ ఒకటి వచ్చింది.
ఆయన అభిమాని ఒకరు కేటీఆర్‌కు ఒక ట్వీట్ చేస్తూ.. ఈ మధ్యకాలంలో నెరిసిన జుట్టుతో కనిపిస్తున్నారని.. యూత్ లీడర్ అయిన కేటీఆర్.. మంత్రుల్లో చిన్నవారు కదా.. జుట్టుకు హెయిర్ డై వేసుకోవచ్చుగా అంటూ సలహా ఇచ్చేశాడు. ఇలాంటి ప్రశ్నకు కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. తాను మరీ కుర్రాడిని కాదని పేర్కొన్నాడు. మొత్తానికి కేటీఆర్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఈ పోస్ట్ అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి.
కేటీఆర్ నెరిసిన జుట్టు అభిమానికి అంత బాగా ఎలా అర్థమైందన్న విషయంలోకి వెళితే.. ఈ మధ్యన పాతబస్తీ పర్యటనకు వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా సరదాగా కాసేపు క్రికెట్.. బాస్కెట్ బాల్ ఆడి..ఆ ఫోటోల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు స్పందించిన ఎంఎన్ ప్రపుల్లకుమార్ అనే యువకుడు.. మంత్రి కేటీఆర్ కు హెయిర్ డై వేసుకోవాలన్న సలహాను ఇచ్చారు. ఈ పోస్టింగ్ పలువురు దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/