దలైలామాకు మోదీ ఫోన్..చైనా ఆగ్రహం.. :మరోసారి ఉద్రిక్తం..

Update: 2022-07-09 04:44 GMT
భారత్,చైనాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడనుందా..? అందుకు బౌద్ధ గురువు దలైలామా కారణం కానున్నారు..? టిబెట్ కు చెందిన దలైలామా చైనాకు ఎందుకు వ్యతిరేకంగా మారారు..? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు..? ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఫోన్ చేశారు..? ఇలాంటి ప్రశ్నల పరంపరపై దేశంలో హాట్ టాఫిక్ సాగుతోంది. బౌద్ధగురువు దలైలామా జన్మదినం సందర్భంగా మోదీ చేసిన ఒక్క ఫోన్ కాల్ మరోసారి చైనాకు కోపం తెచ్చుట్లు చేసిందని కొందరు చర్చించుకుంటున్నారు.  మోదీ దలైలామాకు ఫోన్ చేస్తే చైనా ఎందుకు కోపం తెచ్చుకుంటోంది..?

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తలు కొత్తేమీ కాదు. ప్రతీ విషయంలో చైనా కవ్వింపు చర్యలు పాల్పుడుతూ రెచ్చగొడుతుంది. గతంలో గాల్వామా ఘటనలో రెచ్చిపోయిన చైనీయులు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఆ తరువాత భారత సైన్యం తిరుగుబాటుతో పాటు దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చైనా తోకముడిచేటట్లు చేశాయి. అయితే తాజాగా మరోసారి చైనా అంతర్గత విషయాల్లో కలగజేసుకుంటోంది. మరోసారి భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఇరు దేశాల మధ్య చైనా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్గిని రాజేస్తున్నాయి. అసలు చైనా విదేశాంగ మంత్రి ఏం చేశారంటే..?

బౌద్ధుల గురువు దలైలామా జన్మదినం సందర్భంగా ఆయనకు భారత ప్రధాని మోదీ  శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయిష్సుతో ఉండాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే భారత ప్రధాని దలైలామాకు ఫోన్ చేయడంతో చైనా భగ్గుమంది. దలైలామాకు శుభాకాంక్షలు తెలపడంపై   చైనా విదేశాంగ మంత్రి జావో లిజాన్ స్పందించారు.

చైనా వ్యతిరేక, వేర్పాటు వాదైన దలైలామాకు భారత్ శుభాకాంక్షలు తెలపవచ్చని, కానీ టిబెట్ విషయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు. అంతేకాకుండా టిబెట్ ను అడ్డంపెట్టుకొని చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్నారు.

దలైలామా 1959లో టిబెట్ నుంచి భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో బౌద్ధ ఆశ్రమంలో ఉన్నారు. టిబెట్ మాత్రం చైనా ఆధీనంలోకి వెళ్లిపోయింది. అయితే దలైలామా చైనాకు వ్యతిరేకి. ఆయన వేర్పాటు వాది అని వాదిస్తోంది. అయితే దలైలామా భారత్ లో ఉన్నా ఆయన కార్యకలాపాలను నిత్యం పర్యవేక్షిస్తోంది. ఈ తరుణంలో దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం కచ్చితంగా చైనాను రెచ్చగొట్టడమేనని ఆ దేశ  విదేశాంగ మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉండగా దలైలామా జూలై 14, 15 తేదీల్లో లేహ్ లో పర్యటించనున్నారు. అక్కడి బౌద్ధ మఠాన్ని సందర్శిస్తారు. అయితే దలైలామా ఇలాంటి యాత్రలు చేసినప్పుడల్లా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ లో లక్షల మంది టిబెటియన్లు నివసిస్తున్నారు. 2010 నుంచి టిబెట్, చైనాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. చైనా నాయకులు భారత్ కు వచ్చినప్పుడల్లా టిబెట్ ప్రజలతో మాట్లాడాలని వారు ఒత్తిడి తెస్తున్నారు.
Tags:    

Similar News