నోటికొచ్చినట్లు మాట్లాడటం.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించటం కీలక స్థానాల్లో ఉండే రాజకీయ నేతలకు అలవాటే. ఏ దేశంలోనూ.. ఏ జాతిపిత ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసే సాహసం ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. అందుకు భిన్నంగా భారత్ లోని రాజకీయ నేతల పరిస్థితి ఉంటుంది. ఎంతమాట పడితే అంత మాట.. ఎవరిని పడితే వారిని ఉద్దేశించి నోరు పారేసుకోవటంలో రాజకీయ నేతలు ముందుంటారు.
తాము టార్గెట్ చేస్తే చాలు.. ఎంతటి వారిపైన అయినా ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడరు. తాజాగా జాతిపిత మహాత్మా గాంధీపై కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన అనంతకుమార్ తాజాగా గాంధీజీపై విపరీత వ్యాఖ్యలు చేశారు.
ఆయన స్వాతంత్య్ర సంగ్రామం అంతా బ్రిటిష్ వారి మద్దతుతోనే చేసినట్లుగా తెగపడటమే కాదు.. గాంధీ స్వాతంత్య్రపోరు అంతా ఒక డ్రామా. వారిలో ఒక్కరిని కూడా బ్రిటిష్ పోలీసులు లాఠీతో కొట్టలేదన్నారు. సత్యాగ్రహం.. ఆమరణ దీక్ష వల్లే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కాంగ్రెస్ వాళ్లు చెబుతారని.. కానీ అది తప్పన్నారు. గాంధీజీ చేసిన సత్యాగ్రహం వల్ల బ్రిటీషర్లు ఇండియాను వదిలి వెళ్లలేదన్న ఆయన మాటలు ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. సొంత పార్టీని ఇరుకున పడేసేలా చేశాయి.
గాంధీ మహాత్ముడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమ ఎంపీకి బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరినట్లుగా కర్ణాట బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నారు. సొంత పార్టీ ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోడీ గుర్రుగా ఉన్నారని.. అనంతకుమార్ ను పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్టీ భేటీకి హాజరు కాకూడదని.. ఆయన్ను రానివ్వకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
నిజంగానే.. గాంధీజీ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో బీజేపీ ఆగ్రహంగా ఉంటే.. సదరు ఎంపీ మీద వేటు వేయొచ్చుగా? ఒక్క ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ ఉండదు కదా? గాంధీ మహాత్ముడి మీద గౌరవం ఉంటే.. మోడీ మాష్టారు తన ఎంపీ పై వేటు నిర్ణయాన్ని ఎందుకు తీసుకోరు?