ఇండియాలో సోషల్ మీడియాపై కొత్త ఆంక్షలను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ప్రధానంగా ఇండియాలో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మరియు వెబ్ మీడియా ప్లాట్ ఫామ్ లు కూడా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక టీమ్ ను ఏర్పాటు చేయాలి. ఆ టీమ్ ను లీడ్ చేసే అధికారి ఇండియాలోనే ఉండాలి. సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని ప్రభుత్వ సూచన. అలాగే చాలా మంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ పిల్లల పట్ల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అనేక విధాల నేరాలకు పాల్పడుతున్నారు.
నేరాల పరిశోదనలో ప్రభుత్వాలకు సోషల్ మీడియా సహకరించే విషయంలో కూడా ఆయా సంస్థల నుండి ఒప్పందం ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియాలో నియమితం అయిన అధికారి ప్రభుత్వ విచారణ అధికారులకు స్పష్టమైన సమాచారంను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక యూజర్ల డేటా మొత్తంను కూడా ప్రభుత్వం కు పారదర్శకంగా ఇవ్వాల్సిందే అంటూ కేంద్రం తీసుకు వచ్చిన కొత్త నిబంధనలో ఉంది. అయితే ఈ నిబంధనపై సోషల్ మీడియా సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయి. తమ యూజర్స్ డేటాను ముఖ్యంగా వ్యక్తిగత డేటాను ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు.
తమ వినియోగదారుల వ్యక్తిగత భద్రత లేకుండా చేయడం అనేది భావ ప్రకటన స్వేచ్చ ను హరించడమే అంటూ సోషల్ మీడియా సంస్థలు ముఖ్యంగా ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లు వాదిస్తున్నాయి. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే లా డేటాను తాము ఇవ్వమని మొదట వ్యతిరేకం వ్యక్తం చేసిన సంస్థలు ఆ తర్వాత తప్పక ఇచ్చేందుకు ఓకే చెప్పేస్తున్నాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఆ ఒప్పందం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇండియాలో ఆ ఒప్పందం ఇచ్చేందుకు ఇష్టపడని సోషల్ మీడియా సంస్థలు ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికా.. ఆస్ట్రేలియా.. బ్రిటన్ వంటి దేశాల్లో మాత్రం అక్కడి ప్రభుత్వాలకు డేటాను ఇచ్చేందుకు చాలా కాలం క్రితమే ఓకే చెప్పాయి. అక్కడ ప్రభుత్వం అడిగిన ప్రతి యూజర్ వ్యక్తిగత డేటా నుండి మొదలుకుని అన్ని విషయాలను కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉంటుంది. డేటా ఇవ్వడంతో పాటు వినియోగదారులు ఒకరి నుండి ఒకరు పంపించుకునే మెసేజ్ లను కూడా చదివేందుకు గాను ప్రభుత్వాలకు అనుమతి ఉంటుంది.
పలు దేశాల్లో వ్యక్తిగత భధ్రత.. యూజర్ల ప్రైవసీ.. భావ ప్రకటన స్వేచ్చ భారత్ లోనే ఎందుకు వస్తుందని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలను ప్రశ్నిస్తుంది. ఇండియాలో సోషల్ మీడియా ద్వారా పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ చట్టం తీసుకు వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సాదారణంగా వ్యవహరిస్తే పర్వాలేదు. కాని కక్ష సాదింపు కోసం వినియోగిస్తే మాత్రం ముందు ముందు సోషల్ మీడియాలో సామాన్యుల వ్యక్తిగత భద్రత ఉండదని.. సమాచారం పంచుకోవడం కూడా కష్టం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు వెంటనే కాకున్నా ఇండియాలో కూడా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఇతర దేశాల్లో తమ వినియోగదారుల డేటాను ప్రభుత్వం తో పంచుకున్నట్లుగా పంచుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో వినియోగదారుల స్పందన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.