బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీని వ్యతిరేకించే వారికి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అదే తీరులో ఉండటం గమనార్హం. మోడీని వ్యతిరేకిస్తూ బ్రిటన్ లో నిరసనలతో పాటు.. తాజాగా ఒక సంస్థ చేపట్టిన ప్రచారం మోడీ ఇమేజ్ ను భారీగా డ్యమేజ్ చేస్తోంది. మోడీని బ్రిటన్ కు రావద్దంటూ అవాజ్ అనే సంస్థ ఆందోళన నిర్వహిస్తోంది. భారతదేశంలో మత సహనం లేకుండా పోవటానికి.. మైనార్టీలపై దాడులు జరగటానికి కారణంగా మోడీనే అంటూ ఆరోపిస్తోంది.
ఈ సంస్థ తాజాగా ఒక వినూత్న నిరసన చేపట్టి.. వార్తల్లోకి వచ్చింది. యూకే పార్లమెంటు భవనంపై ప్రొజెక్టర్ ద్వారా.. మోడీ.. నాట్ వెల్ కమ్ అంటూ ఓ పెద్ద ఇమేజ్ పార్లమెంటు మీద పడేలా చేసింది. కాషాయం బ్యాక్ గ్రౌండ్ లో కత్తి పట్టుకున్న మోడీ ఫోటోను.. స్వస్తిక్ మార్క్ ను వేయటంతో పాటు.. నిరసన వ్యక్తం చేస్తున్న సంస్థ వెబ్ సైట్ వివరాల్ని అందులో ఉంచారు.ను
ఈ వినూత్న నిరసన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూకే పార్లమెంటు భవనంపై ప్రొజెక్టర్ తో ఇమేజ్ వేయటం ద్వారా మోడీ మీద తమకున్న అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేసినట్లు అయ్యింది. రెండో ప్రపంచ యుద్దంలో మరణించిన వారికి గుర్తుగా యూకే స్మరణ దినోత్సవం జరుగుతున్న సమయంలో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఈ వినూత్న నిరసన పలువురిని ఆకర్షిస్తోంది. బ్రిటన్ పర్యటన కోసం ప్రధాని మోడీ గురువారం బయలుదేరనున్నారు. మరోవైపు.. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా అవాజ్ సంస్థ అదే రోజు నిరసన ర్యాలీ నిర్వహిస్తుండటం గమనార్హం.