జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధం అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరమని అయితే, పవన్ కల్యాణ్ చెగువేరాను అభిమానిస్తున్నారు కానీ నిజ జీవితంలో మన్మధుడ్ని ఫాలో అయ్యారని ఆరోపించారు. ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోయారని - నైతికతను వివాహ బంధంలో విడనాడారని ఆరోపించారు. ``రాజకీయాలలో సైతం అదే విధంగా నైతికతను మరిచిపోయారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి లోకేష్ అవినీతిపై మాట్లాడి తర్వాత మరచిపోయారు. ఇసుక వరదల వల్ల కొరత వస్తే దానిపై ప్రభుత్వం చెబుతున్నప్పటికి లాంగ్ మార్చ్ చేశారు. తిరుపతి సభలో మీకు వాచ్ డాగ్ లా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉన్నా - ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాను. శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టి నారాయణ కమిటి నిర్ణయాలు అమలు చేసినా ప్రశ్నించలేదు.`` అని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేది కాదు ప్రశ్న....తనతో బంధంలో ఉన్నపుడే వేరే అమ్మాయితో సంబంధం కొనసాగించారని రేణుదేశాయే స్వయంగా చెప్పారు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ``మీ తల్లి మిమ్మల్ని సంస్కారయుతంగా పెంచారని చెప్పారు.మరి అది మీ చేతల్లో కనిపించడం లేదు.అది వివాహ బంధం కావచ్చు - రాజకీయాలలో కావచ్చు. రైతుల ఇబ్బందులను ప్రశ్నిస్తానని చెప్పి కనీసం ఆ పని చేయలేదని ఇక్బాల్ ఆరోపించారు. ``రైతు వేషంలో వచ్చి చంద్రబాబుతో వచ్చి కలిసి ప్యాకేజి మాట్లాడుకున్నారని ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు చేసిన 2.50 లక్షల కోట్ల అప్పు - 40వేల కోట్ల బిల్లులపై మీరు ప్రశ్నించారా? దేశంలో వృధ్ది రేటు గురించి ప్రస్తావిస్తూ రాష్ర్ట వృధ్ది రేటును చంద్రబాబు చెబుతున్నా మీరు నిలదీయలేదు. నీరు-మట్టి - పుష్కరాలు - తాత్కాలిక కట్టడాలలో దోపిడీని - పోలవరం దోపిడీని ఇసుక మాఫియాను కనీసం ప్రశ్నించలేకపోయారు. ఇంగ్లీషు మీడియా అనేది తక్షణం తీసుకోలేదు. నిపుణుల కమిటి తన పాదయాత్రలో ప్రజలు చెప్పిన మీదటనే ఆ నిర్ణయం అమలు చేస్తున్నారు. పేదలు తమ బిడ్డలు ఇంగ్లీషు మీడియంలో చదివించాలని అనుకుంటున్నారు అది వారికి ఆర్దికంగా ఎలా భారమవుతుంది దానిని తొలగించాలంటే ఏం చేయాలని ఆలోిచించి నిర్ణయం తీసుకున్నారు.`` అని అన్నారు.
ఇంగ్లీషు మీడియం చదువుకుంటే మతం మారతారన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారని ఇక్బాల్ ప్రశ్నించారు. ``ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం అలా ఎందుకు రాస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే.జగన్ గారి మతాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు. జగన్ ది సెక్యులర్ తత్వం - శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి జగన్‌కి అనుబంధం గురించి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కులాలు - మతాల పట్ల గౌరవం ఎంతగానో ఉంది. అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. ఆయన ప్రవేశపెడుతున్న పథకాలే ఇందుకు సాక్ష్యం. తిరుమలకు ఓ సామాన్య భక్తుడిగా జగన్ వెళ్ళారు. ఆయనకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు. పీఠాధిపతులే సర్టిఫికేట్ ఇచ్చారు. మీరు చెబుతున్న సర్టిఫికేట్ అవసరం లేదు. 2050లో మన రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా చేస్తామన్నారు.దానికి ప్రతిపాదనలు కనిపించడం లేదు. 2030లో పేదరికాన్ని పోగొడతామని అన్నారు. మీరు అప్పటిదాకా ఉంటారా అని రాధాకృష్ణ ప్రశ్నించలేదు. ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్దామని అన్నారు. దాని గతిలేదు. బడుగు బలహీనవర్గాల కోసం చేసిన నిర్ణయం ఇంగ్లీషు మీడియం. తెలంగాణాలో ఇంగ్లీషు మీడియంతో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ల్ లో ప్రవేశపెట్టారు. దాని అంతర్గత సారాంశం ఏపి పిల్లలు ఉన్నతస్దితికి తీసుకురావాలని రాజన్నబాట పెట్టారు. ప్రజల నాడిని గమనించి దానిపై నోరుమూసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం.`` అని పేర్కొన్నారు.
జగన్ పై ఉన్నవి బనాయింపబడిన కేసులు అని ఇక్బాల్ అన్నారు. `ఆయన అవినీతి లక్ష కోట్లు అన్నారు. తర్వాత 43 వేల కోట్లు అన్నారు.నిజానికి 1300 కోట్లు పైబడి మాత్రమే సంబంధించిన వ్యవహారం అని దర్యాప్తు అదికారి చెప్పారు. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.అధికారులపై కేసులు ఎలా తేలిపోయాయో అదే రీతిలో జగన్ కేసులు విషయంలో కూడా ఉంటుంది.`` అని వెల్లడించారు.