కరోనా చాలదన్నట్టు.. విజృంభిస్తున్న మోయామోయా వ్యాధి!

Update: 2021-05-14 16:30 GMT
ఓ వైపు క‌రోనాతో ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మైపోతుంటే.. మ‌రోవైపు మోయామోయా అనే అరుదైన వ్యాధి రెక్క‌లు విప్పుతోంది. గ‌తంలోనే ఉన్న ఈ వ్యాధి.. ఇప్పుడు విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా జ‌పాన్ వంటి తూర్పు ఆసియా దేశాలను వ‌ణికిస్తోంది. ప్ర‌స్తుతం జ‌పాన్లో ఈ వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే.. ఈ వ్యాధి ఏ వ‌య‌సు వారిలోనైనా క‌నిపించే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్కువ‌గా చిన్నారుల్లోనే క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం.

ఈ వ్యాధి వ‌చ్చిన వారికి తల‌నొప్పి, నీర‌సం, ముఖం, అర‌చేతులు, కాళ్లు మొద్దుబార‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయట‌. ముఖ్యంగా శ‌రీరంలో ఒక‌వైపు మొత్తం మొద్దుబారిన‌ట్టుగా ఉంటుంది. అదేవిధంగా.. వినికిడి శ‌క్తి త‌గ్గుతుంది. మాట‌లు త‌డ‌బ‌డ‌తాయి. నెమ్మ‌దిగా స్పందించ‌డం వంటివి ప్ర‌ధాన ల‌క్ష‌ణాలుగా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్ల‌లు ఎక్కువ‌గా ఏడ‌వ‌డం, ద‌గ్గు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయ‌ట‌.

ఈ వ్యాధి చాలా వ‌ర‌కు వంశ‌పారంప‌ర్యంగా సంక్ర‌మిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కొరియా, జ‌పాన్‌, చైనా దేశాల్లోని జ‌నం ఈ వ్యాధి బారిన ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. కుటుంబంలో గ‌తంలో ఎవ‌రికైనా ఈ వ్యాధి ఉంటే.. భ‌విష్య‌త్ త‌రాల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. 15 ఏళ్ల‌లోపు పిల్ల‌ల‌తోపాటు మ‌హిళ‌ల్లో ఈ వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి ర‌క్త‌నాళాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని చెబుతున్నారు. గుండె నుంచి మెద‌డుకు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ధ‌మ‌నుల్లో ఇబ్బందులు క‌లిగిస్తుంద‌ట‌. ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యే మార్గాలు మూసుకుపోవ‌డం.. లేదా స‌న్న‌గా మార‌డం జ‌రుగుతుంద‌ట‌. దానివ‌ల్ల మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గిపోతుంద‌ని చెబుతున్నారు. ఫ‌లితంగా.. స్ట్రోక్ రావ‌డం, మెద‌డులో ర‌క్తం కార‌డం వంటి ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ట‌.

అయితే.. ఈ వ్యాధి ల‌క్ష‌ణాల‌ను వెంట‌నే గుర్తించి వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్తే.. ఇత‌ర తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల నుంచి కాపాడ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. క‌రోనా భ‌యంతో బెంబేలెత్తిపోతున్న జ‌నానికి ఈ వార్త మ‌రో పిడుగులా ప‌రిణ‌మించింది. ఇంకా.. భ‌విష్య‌త్ లో ఎలాంటి ప‌రిణామాలు చూడాల్సి వ‌స్తుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.
Tags:    

Similar News