వారు ముగ్గురు నాయకులు. అందులో ఇద్దరు వేరు వేరు పార్టీలకు చెందిన వారు. అయినా సరే ముగ్గురూ ఒక విషయంలో ఒకే గొంతుక వినిపించారు. ఆ విషయం జగన్ అయితే వారు ముగ్గురూ బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఎయిర్ పోర్టులోకి దిగిన తరువాత రోడ్ షో ద్వారా నేవీ వారి అతిధి గృహానికి చేరుకున్నారు.
అక్కడ ఆయన బీజేపీ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సాగుతున్న ప్రభుత్వం తీరు మీద నాయకులు మోడీకి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. కానీ అత్యధిక శాతం ఫిర్యాధులు మాత్రం ముగ్గురు నేతల నుంచి వెళ్ళడం విశేషం. వారే ప్రస్తుత ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, అలాగే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న పీవీఎన్ మాధవ్. ఈ ముగ్గురూ జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాల మీద మోడీకి గట్టిగా ఫిర్యాదు చేశారని ప్రచారం సాగుతోంది.
దాదాపుగా గంటన్నర పాటు జరిగిన ఈ కోర్ కమిటీ మీటింగులో మోడీకి వైసీపీ సర్కార్ మీద బలమైన ఫిర్యాదులు ఈ ముగ్గురు నాయకులు చేశారని అంటున్నారు. ఏపీలో వైసీపీ సర్కార్ ప్రభుత్వ వైఫల్యాలు వీరు పూసగుచ్చినట్లుగా వివరించారు. అలగే విశాఖలో ఒక్కసారిగా పెరిగిన భూదందాల గురించి కూడా మోడీకి ఫిర్యాదు చేశారు అని చెబుతున్నారు.'
వీటి మీద మోడీ సమక్షంలో చర్చకు పెట్టడంలో వీరు సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం మోడీ అశీస్సులు ఉన్నట్లుగా చెప్పుకుంటోందని, నిజానికి అలా ఉందా అని బీజేపీ నేతలు మోడీనే డైరెక్ట్ గా అడిగినట్లుగా సమచారం. దానికి మోడీ బదులిస్తూ సమాఖ్య వ్యవస్థలో రాజకీయాలు తావు లేకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి మధ్య సహకారం ఉంటుందని, అంతే తప్ప మద్దతు కేంద్రం ఎందుకు ఇస్తుందని పార్టీ నేతలకు చెబుతూ మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయండని పిలుపు ఇచ్చారని చెబుతున్నారు.
వైసీపీ ఒక రాజకీయ పార్టీగా తన ప్రచారం తాను చేసుకుంటుందని, దాన్ని ఢీ కొట్టేలా ఏపీ బీజేపీ నేతలు కూడా తమకు తోచిన తీరున పోరాటం చేయాలని మోడీ సూచించారు అని అంటున్నారు. దీంతో మోడీ ప్రభుత్వం కానీ మోడీ కానీ వ్యక్తిగతంగా జగన్ కి ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదని ప్రధాని క్లారిటీ ఇచ్చినట్లు అయింది.
దాంతో మరింగ ఉత్సాహంతో చాలా మంది నేతలు జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. చిత్రమేంటి అంటే ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి జగన్ని విమర్శిస్తున్న వారు మాత్రం ఈ మీటింగులో సైలెంట్ అయిపోగా ఎపుడూ మీడియా ముందుకు రాని వారు జగన్ సర్కార్ మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు. మొత్తానికి తన మద్దతు ఏదీ వైసీపీకి లేదు అని మోడీ గట్టిగా చెప్పిన వేళ ఏపీ బీజేపీ నేతలు టోన్ ఎలా మారుతుంది. వారి పోరాటాలు ఎలా బలంగా ముందుకు వస్తాయి అన్నది చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.