తెలంగాణ హైకోర్టుకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుర్కయాంజల్ లో తులిప్స్ గ్రాండ్ హోటల్ అనుమతులపై హైకోర్టుకు ఎంపీ కోమటిరెడ్డి లేఖలో ఫిర్యాదు చేశారు. హెచ్.ఎండీఏ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ హోటల్ నిర్మించారని లేఖలో పేర్కొన్నారు.
అక్రమంగా నిర్మించిన హోటల్ ను మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారని కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది హైకోర్టు. తులిప్స్ గ్రాండ్ హోటల్ యాజమాన్యాన్ని ప్రతివాదిగా చేర్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తులిప్స్ గ్రాండ్ హోటల్ కు నోటీసులు జారీ చేసింది.
కాగా హెచ్ఎండీఏ పరిధిలో ఎప్పటి నుంచో అక్రమ నిర్మానాలు జరిగాయని.. చాలా సార్లు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమ కట్టడాల కారణంగానే మొన్నటి వరదలకు హైదరాబాద్ మునిగిందని.. వీటిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.