మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటులో మహిళలు మాత్రమే మాట్లాడాలంటూ ప్రధాని నరేంద్రమోడీ సూచించటం తెలిసిందే. దీంతో.. మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే.. పార్లమెంటు సమావేశాలు కాదు.. సమావేశాల ప్రారంభానికి ముందే హాట్ టాపిక్ అయి.. అందరి నోట్లో నానారు కాంగ్రెస్ మహిళా ఎంపీ రంజీత్ రంజన్.
బ్లూకలర్ చుడీదార్... కోట్ ధరించి.. బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని ఆరంజ్ కలర్ హార్లీ డేవిడ్ సన్ బైక్ మీద దూసుకొచ్చిన ఆమెను చూసి అందరూ ఆసక్తిగా చూడటమే కాదు.. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమె ఫోటోల్ని తీసుకునేందుకు పోటీ పడ్డారు. పార్లమెంటు దగ్గర సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారిన రంజీత్ రంజన్ ఎవరో కాదు.. బీహార్ వివాదాస్పద నేత పప్పు యాదవ్ సతీమణి. బీహార్ లోని సోపాల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. మహిళా దినోత్సవం సందర్భంగా కొంగొత్తగా పార్లమెంటుకు వచ్చి సంచలనం సృష్టించారు.