21 రోజుల్లో కష్టాలన్నీ తిరిపోతాయాట

Update: 2016-12-02 07:23 GMT
నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని ఏ ముహుర్తంలో ప్రకటించారో కానీ.. ప్రజల పరిస్థితి పులుసులో మునక్కాయల మాదిరిగా తయారైంది. పులుసులో రుచి కోసం పనికి వచ్చే ములక్కాయను అలానే ఉండొచ్చు.. లేదంటే పిప్పి తీసి పారేసి పక్కన పడేయొచ్చు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీ నిర్ణయించిన ప్రకటన తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

అదే సమయంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్ని మీడియా కూడా రెండుగా చీలి పోయింది. కొన్నిమీడియా సంస్థలు రద్దుతో వచ్చే లాభాల్ని పేజీలకు పేజీల వార్తలు అందిస్తోంటే.. మరికొన్నిమీడియాసంస్థలు మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఫోకస్ చేసేలా వార్తలు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నోట్లరద్దు.. అనంతరం కరెన్సీ నోట్ల కష్టాలపై కేంద్రం ఏమని చెబుతోంది? అసలీ విషయంలో కేంద్రం వాదన ఏమిటి? వారికి కరెన్సీ కష్టాలు ఎంతలా ఉన్నాయన్న విషయం తెలిసిందా? అన్నది సందేహంగా మారింది. ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది.. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

నల్లధనం అదుపు.. నకిలీ నోట్ల నిర్మూలన.. ఉగ్రవాదులకు నిధుల నిలుపుదల లాంటి అంశాలపై ఫోకస్ చేసి.. ఆ పరిస్థితుల్ని సరిదిద్దటానికి కేంద్రం ప్రయత్నిస్తుందని చెప్పిన ఆయన.. రానున్న మూడు వారాల్లో పరిస్థితి చక్కబడుతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో.. నోట్ల రద్దు అంశం రాజ్యాంగంలోని 73వ అధికరణం ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ సార్వభౌమాధికారం పరిధిలోకి వస్తుందని.. దీన్నికోర్టులు విచారించలేవని తేల్చింది. ఈ విషయాల్ని పక్కన పెట్టినా.. ఒక్కటి మాత్రం నిజమని చెప్పక తప్పదు. నోట్ల కష్టాలు మరో మూడు వారాలు తప్పనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News