మీద పడుతున్న వయసు మహిమో.. లేక తనకు లేని బలాన్ని ఉందని ఫీలై.. విషయం తెలుసుకొని సర్దుకుంటున్నారో కానీ.. సమాజ్ వాదీ చీఫ్ తరచూ తప్పుల మీద తప్పులు చేస్తూ తన ఇమేజ్ ను తానే డ్యామేజ్ చేసుకుంటున్న పరిస్థితి. కుటుంబ కలహాల సందర్భంగా తనకున్న బలాన్ని అంచనా వేయటంలో తప్పులో కాలేసిన ములాయం.. కొడుకుతో పేచీ పెట్టుకొని.. గాండ్రించిన ఆయన చివరకు వెనక్కి తగ్గిన వైనం తెలిసిందే.
తాజాగా అలాంటి ముచ్చటే మరోసారి చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న యూపీ సీఎం అఖిలేశ్ నిర్ణయాన్ని ములాయం తీవ్రంగా తప్పు పట్టారు. అంతేకాదు.. కొడుకు మీద అలిగిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ప్రచారానికి వెళ్లనంటూ ములాయం వ్యాఖ్యానించారు. దీంతో.. ముగిసిపోయిన గొడవలు మళ్లీ బయటపడ్డాయా? అన్న సందేహం వచ్చింది.
అయితే.. తన తండ్రి చెప్పినట్లుగా ఏమీ జరగదని.. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారంటూ మూడురోజులు ముందు అఖిలేశ్ వ్యాఖ్యానించారు. దీనికి తగ్గట్లే తాజాగా ములాయం సింగ్ నోటి మాట మారిపోయింది. తాను సమాజ్ వాదీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు ములాయం ప్రకటించారు. ఎంత కాదన్నా అఖిలేశ్ తన కొడుకేనని.. పార్టీ తరఫున.. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తానని వెల్లడించారు. ములాయం నోట తాజా మాట రావటానికి వెనుక జరిగిన కథ వేరుగా చెబుతున్నారు. తండ్రిమాటల కారణంగా పార్టీకి నష్టమని.. అదే జరిగితే చేతిలో ఉన్న అధికారం చేజారుతుందన్న మాటను ములాయంకు అర్థమయ్యేలా అఖిలేశ్ చెప్పటంతో ఆయన నోట మారిందని చెబుతున్నారు. యూపీ ఎన్నికలు ముగిసే నాటికి ములాయం నోట ఈ తరహా మాటలు మరెన్ని వినాల్సి వస్తుందో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/