ఏపీ ఎంపీల తీరుపై మండిపడిన పవన్‌కల్యాణ్‌పై ఏపీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు కాస్తంత చిత్రంగా ఉంది. కొందరు తీవ్రస్థాయిలో మండి పడితే.. మరికొందరు మనకెందుకులే అన్నట్లుగా మౌనంగా ఉన్నారు. మరికొందరు మాత్రం తాము పవన్ అభిమానులమే అంటూ కాస్తంత కవరింగ్ ఇస్తూనే.. పవన్ చేసిన వ్యాఖ్యలు కాస్తంత సమాచార లోపం కారణంగా అలా మాట్లాడి ఉంటారన్న వాదనను వినిపిస్తున్నారు.
అలాంటి వాదనను వినిపించిన ఎంపీల్లో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒకరు. తాను పవన్ అభిమానినని.. తాము ఢిల్లీలో ఏపీ ప్రయోజనాల కోసం బిపరీతంగా ప్రయత్నిస్తున్నామని చెప్పిన ముత్తంశెట్టి.. కావాలంటూ పవన్‌ను పార్లమెంటుకు వచ్చి చూడాలని కోరారు.
పవన్ పార్లమెంటుకు రావాలని భావిస్తే తాను రాజీనామా చేసేందుకు సైతం సిద్ధమేనంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. పవన్ కల్మషం లేని వ్యక్తిని అని పేర్కొన్నారు. మొత్తానికి పవన్‌ని పొగుడుతూనే.. ఎంత వినయంగా విమర్శలు చేశారో కదూ.